9వ ఆసియా కప్.. 9 సార్లు ఫైనల్ చేరిన టీమిండియా.. రికార్డులే రికార్డులు !
Asia Cup 2024 semi-final : ఆసియా కప్ 2024 సెమీ ఫైనల్ లో బంగ్లాదేశ్ ను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన భారత జట్టు రికార్డు స్థాయిలో 9వ సారి ఫైనల్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ తో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.
India Women, Asiacup 2024
Asia Cup 2024 semi-final : ఆసియా కప్ 2024 లో భారత మహిళ క్రికెట్ జట్టు మరోసారి ఫైనల్ కు చేరుకుంది. ఈ ఐసీసీ మెగా టోర్నీలో ఇప్పటివరకు భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా తన జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. వరుస విజయాలతో సెమీస్ చేరింది.
సెమీ ఫైనల్ లో బంగ్లాదేశ్ జట్టును ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఫైనల్ లోకి అడుగుపెట్టిన భారత్ ప్రస్తుతం ఐసీసీ ట్రోఫీని అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు ఒక్క వికెట్ కోల్పోకుండా 11 ఓవర్లలో 83 పరుగులతో విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే రికార్డుల మోత మోగించింది.
Asia Cup 2024, Team India, India
ప్రస్తుతం జరుగుతున్నది తొమ్మిదవ ఎడిషన్ మహిళల ఆసియా కప్. ఈ టోర్నీ ఆరంభం నుంచి భారత్ జట్టు ప్రతిసారి ఫైనల్ కు చేరుకుంది. అంటే వరుసగా తొమ్మిదవ ఎడిషన్ లోనూ భారత జట్టు తొమ్మిదోసారి ఫైనల్‌లోకి ప్రవేశించింది. అంతర్జాతీయ క్రికెట్ లో ఇది సరికొత్త రికార్డు.
India Women vs Bangladesh Women, India ,
ఈ మ్యాచ్ లో ఒక్క టాస్ మినహా.. అన్ని విషయాల్లోనూ భారత జట్టు విజయం సాధించింది. టాస్ భారత్ ఓడటంతో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, ఆరంభంలోనే టాప్-3 బంగ్లాదేశ్ బ్యాటర్లను తక్కువ స్కోర్లకే ఔట్ చేసి రేణుకా ఠాకూర్ సింగ్ ఈ అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించారుఏ. 2018 ఛాంపియన్‌లు బ్యాటింగ్ చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. భారత బౌలింగ్ ముందు ఎక్కువ సేపు నిలవలేక పెవిలియన్ బాటపట్టారు.
బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో నిగర్ సుల్తానా, షోర్నా అక్టర్ మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. రాధా యాదవ్ డబుల్ వికెట్ మెయిడిన్‌తో ఇన్నింగ్స్‌ను ముగించారు. దీంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 80/8 మాత్రమే చేసింది. ఊహించినట్లుగానే ఛేజింగ్ డిఫెండింగ్ ఛాంపియన్‌లు మరోసారి ప్రత్యర్థులకు షాకిచ్చారు. స్మృతి మంధాన బౌండరీలు బాదుతూ 5 ఓవర్లలోనే భారత స్కోర్ బోర్డును 40 పరుగులు దాటించారు. మరో ఎండ్ లో షఫాలీ వర్మ తనదైన స్టైల్లో బ్యాట్ తో మెరిశారు. హ్యాట్రిక్ బౌండరీలతో మంధాన హాఫ్ సెంచరీ చేయడంతో పాటు భారత జట్టుకు 11 ఓవర్లలోనే 83 పరుగులతో విజయాన్ని అందించారు.