పాక్‌పై భారీ విజయం... టెస్టు ర్యాంకింగ్‌లో టాప్‌కి దూసుకెళ్లిన న్యూజిలాండ్... టీమిండియాకు చావోరేవో...
First Published Jan 6, 2021, 10:14 AM IST
పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 176 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది ఆతిథ్య న్యూజిలాండ్. ఈ విజయంతో 2-0 తేడాతో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కి దూసుకెళ్లింది న్యూజిలాండ్. వరుస సెంచరీలతో కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఇప్పటికే టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే.

కేన్ విలియంసన్ డబుల్ సెంచరీతో 238 పరుగులు, హెన్రీ నికోలస్ 157 పరుగులు, డేరీ మిచెల్ 102 పరుగులు చేయడంతో మొదట ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 659 పరుగుల భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసింది న్యూజిలాండ్.

మొదటి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకి ఆలౌట్ అయిన పాకిస్తాన్, రెండో ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే చాప చుట్టేసింది. అజర్ ఆలీ, జోఫర్ గోహర్ చేసిన 37 పరుగులే పాక్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్లు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?