‘నయా వాల్’ ఛతేశ్వర్ పూజారాకి ఏమైంది... ఈ ఏడాదిలో ఒక్క సెంచరీ కూడా లేకుండా...
ఛతేశ్వర్ పూజారా... సంప్రదాయ టెస్టు క్రికెట్‌కి ఆదరణ తగ్గుతున్న సమయంలో భారత జట్టులో ఆశాకిరణంలా మెరిసిన క్రికెటర్. తనదైన బ్యాటింగ్‌తో బౌలర్ల ఓపికకు పరీక్ష పెట్టే ఛతేశ్వర్ పూజారా... కొంత కాలంగా తన రేంజ్‌కి తగిన ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. గత ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన పూజారా, ఈ ఏడాది మూడు ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు.
2010లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన ఛతేశ్వర్ పూజారా, దశాబ్ద కాలంగా భారత టెస్టు టీమ్‌లో కీలక ప్లేయర్‌గా మారాడు...
‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్‌ను తలపించే టెస్టు ఇన్నింగ్స్‌లతో ‘నయా వాల్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఛతేశ్వర్ పూజారా...
ఇప్పటిదాకా 78 టెస్టులు ఆడిన 32 ఏళ్ల ఛతేశ్వర్ పూజారా... 18 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి...
అయితే కొంతకాలంగా బ్యాటింగ్‌లో బాగా ఇబ్బంది పడుతున్నాడు పూజారా. 2020 సీజన్‌లో ఏడు ఇన్నింగ్స్‌లు ఆడిన పూజారా... చేసింది ఒకేఒక్క హాఫ్ సెంచరీ...
ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో 160 బంతుల్లో 43 పరుగులు చేసిన పూజారా... ఆస్ట్రేలియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. అయితే పూజారా ఇన్నింగ్స్ మరీ సా...గినట్టు కనిపించింది.
డాట్ బాల్స్ ఎక్కువగా ఆడినా లూజ్ బాల్స్‌ను బౌండరీకి తరలించే ఛతేశ్వర్ పూజారా.. క్లాస్ బ్యాటింగ్ చూడడానికి బహు చక్కగా ఉంటుంది... అయితే ప్రస్తుతం పూజారాలో అది మిస్ అయ్యింది.
సాధ్యమైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండడానికి ప్రాధాన్యం ఇస్తున్న పూజారా, తన క్లాస్ టచ్ షార్ట్స్‌ను ఆడడానికి ఇబ్బందిపడుతున్నాడు.
2020 సీజన్‌లో టెస్టు క్రికెట్‌కి 8 నెలల సుదీర్ఘ గ్యాప్ రావడం, పూజారాకి ఐపీఎల్, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడడానికి అవకాశం లేకపోవడంతో సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ ఆడుతున్నాడు పూజారా...
గత ఆస్ట్రేలియా పర్యటనలో మూడు సెంచరీలతో చెలరేగిన పూజారా... ఈసారి ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేడని ముందుగానే హెచ్చరించింది ఆస్ట్రేలియా...
పూజారాను అవుట్ చేసేందుకు ప్రత్యేక వ్యూహాలతో బరిలో దిగుతోంది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు. ఇవి మంచి ఫలితాలను కూడా ఇస్తున్నాయి...
అన్నింటికీ మించి పూజారాపై పెరిగిపోయిన అంచనాలు కూడా అతని పూర్ పర్ఫామెన్స్‌కి కారణం అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ విశ్లేషకులు.
2014 సీజన్‌లోనూ ఇలాగే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన పూజారా, కొన్నాళ్ల తర్వాత మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఛతేశ్వర్ పూజారా నుంచి అలాంటి కమ్‌బ్యాక్ ఇన్నింగ్స్ ఆశిస్తోంది టీమిండియా.
విరాట్ కోహ్లీ గైర్హజరీతో టాప్ బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయిన భారత జట్టుకు పూజారా చాలా కీలకం కానున్నాడు. ఈ దశాబ్దంలో అత్యధిక బంతులు ఎదుర్కొన్న క్రికెటర్లలో ఒకడిగా నిలిచిన పూజారా, ఫామ్‌లోకి వస్తే టీమిండియా విజయం పెద్ద కష్టమేమీ కాదు.