టీమిండియా టెస్టు టీమ్‌లో కొత్త కుర్రాడు... ఎవరీ సౌరబ్ కుమార్...
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో కొత్తగా కనిపించిన పేరు సౌరబ్ కుమార్. టీమిండియా ఏ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రియాంక్ పంచల్, సఫారీ టూర్‌కి రోహిత్ శర్మకి రిప్లేస్‌మెంట్‌గా ఎంపిక కాగా... సౌరబ్ కుమార్‌కి జట్టులో చోటు దక్కడం ఇదే తొలిసారి...

28 ఏళ్ల సౌరబ్ కుమార్, ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ ఏరియాలో జన్మించాడు. 2017 రంజీ ట్రోఫీలో నాలుగు మ్యాచుల్లో 23 వికెట్లు తీసి యూపీ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు సౌరబ్..
రంజీ పర్ఫామెన్స్ కారణంగా ఐపీఎల్ 2017 సీజన్‌లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టు, సౌరబ్ కుమార్‌ని బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది...
ఇండియా బ్లూ తరుపున దులీప్ ట్రోఫీ ఆడిన సౌరబ్ కుమార్, ఆ టోర్నీలో 3 మ్యాచుల్లో 19 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
2018 రంజీ ట్రోఫీలో హర్యానాపై 65 పరుగులిచ్చి 14 వికెట్లు తీసిన సౌరబ్ కుమార్, జనవరి 2021లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కి నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు..
ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 46 మ్యాచుల్లో 196 వికెట్లు తీసిన సౌరబ్ కుమార్‌కి 16 ఫైవ్ వికెట్ హాల్స్, ఆరు మ్యాచుల్లో 10 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి..
ఉత్తరప్రదేశ్‌లోనా భాగ్‌పట్ నుంచి న్యూఢిల్లీలోని సునీత శర్మ క్రికెట్ అకాడమీకి వారానికి మూడు సార్లు రైలులో ప్రయాణం చేసే వచ్చేవాడు సౌరబ్ కుమార్...
స్పిన్ బౌలర్‌గానే కాకుండా బ్యాటుతోనే అదరగొట్టడం సౌరబ్ కుమార్ స్పెషాలిటీ. 2017 రంజీ ట్రోఫీలో బరోడాపై సెంచరీ చేసి, కుల్దీప్ యాదవ్‌తో కలిసి 8వ వికెట్‌కి 192 పరుగులు జోడించాడు సౌరబ్ కుమార్...
యూపీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు జయంత్ యాదవ్, రవీంద్ర జడేజాలకు శ్రీలంకతో టెస్టు టీమ్‌లో అవకాశం దక్కింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిట్‌నెస్ నిరూపించుకోలేకపోతే సౌరబ్ కుమార్‌కి తుదిజట్టులో అవకాశం దక్కొచ్చు...