- Home
- Sports
- Cricket
- ఐపీఎల్‌ను టచ్ చేయడం మీ వల్ల కాదు, పీఎస్‌ఎల్‌లో ఎన్ని మార్పులు చేసినా... ఆకాశ్ చోప్రా రియాక్షన్...
ఐపీఎల్‌ను టచ్ చేయడం మీ వల్ల కాదు, పీఎస్‌ఎల్‌లో ఎన్ని మార్పులు చేసినా... ఆకాశ్ చోప్రా రియాక్షన్...
ఐపీఎల్ కంటే పాక్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) తక్కువ కాదని, ఇంకిత ఎక్కువేనని కామెంట్లు చేయడం పాక్ ప్లేయర్లకు, మాజీ క్రికెటర్లకు బాగా అలవాటు. పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా కూడా పీఎస్‌ఎల్‌లో, ఐపీఎల్ మాదిరి వేలం సిస్టమ్ ప్రవేశపెడితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడడానికి ఎవ్వరూ ముందుకు రారంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు...

పాకిస్తాన్ పర్యటనకు వచ్చినవారికి సరైన ఆహారం, ఆతిథ్యం ఇవ్వడానికి అష్టకష్టాలు పడుతున్న పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మెన్, ఈ విధంగా కామెంట్లు చేయడం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యింది...
పాక్ సూపర్ లీగ్‌లో కాంట్రాక్ట్ ప్రకారం రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదని ఆసీస్ క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్, సీజన్ మధ్యలోనే వెళ్లిపోయాడు. అతనిపై బ్యాన్ వేసి, ఫాల్కనర్‌దే తప్పంటూ ఆరోపణలు చేసి చేతులు దులుపుకుంది పీసీబీ...
ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు రిటైన్ చేసుకున్నందుకు రూ.4 కోట్లు చెల్లిస్తుంటే, పీఎస్‌ఎల్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్ తీసుకునే మొత్తం రూ.3 కోట్లే... ఇదే భారత క్రికెట్ ఫ్యాన్స్‌కి కోపాన్ని, ఆగ్రహాన్ని తెప్పించింది...
‘ఒకవేళ నువ్వు అన్నట్టే డ్రాఫ్ట్ పద్ధతిలో కాకుండా పాక్ సూపర్ లీగ్‌లో వేలం సిస్టమ్ ప్రవేశపెట్టారనే అనుకుందాం... మీ దగ్గర రూ.16 కోట్ల ప్లేయర్‌ను చూడగలమా?
పాక్ బోర్డుకి కానీ, పీఎస్‌ఎల్‌కి గానీ అంత సీన్ లేదు. మీ దగ్గర అంత మార్కెట్ కూడా లేదు. కాబట్టి ఎప్పుడూ ఏ విషయంలోనూ ఐపీఎల్‌తో పోల్చుకోకండి...
ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే గత ఏడాది క్రిస్ మోరిస్, ఐపీఎల్‌లో వేసిన ఒక్కో బంతికి తీసుకున్న మొత్తం... మిగిలిన లీగ్స్‌లో ఖరీదైన ఆటగాడికి ఇచ్చే మొత్తం కంటే ఎక్కువే...
కాబట్టి పాక్ సూపర్ లీగ్, బిగ్‌బాస్ లీగ్, ది హండ్రెడ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లతో ఐపీఎల్‌ను పోల్చకండి. అది కరెక్ట్ పోలిక కాదు, కాబోదు...
ఐపీఎల్‌లో ప్లేయర్లు తీసుకునే మొత్తం, ప్రసారహక్కుల ద్వారా వచ్చే ఆదాయం... ఫ్రాంఛైజీల విలువ, పర్సు వాల్యూ... అన్నీ ఆటతోనే సంబంధం కలిగి ఉంటాయి...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...