ప్లానింగ్ లేదు, పాడూ లేదు... వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌లో కంఫ్యూజన్స్ ఎక్కువైంది! హనుమ విహారి కామెంట్స్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటిదాకా ప్రపంచ కప్‌లో ఏ టీమ్‌ని ఆడించాలనే విషయంలో టీమిండియాకి ఎలాంటి క్లారిటీ రానట్టు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఈ విషయం మరోసారి స్పష్టమైంది...
కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి కీ ప్లేయర్లు గాయపడడం... విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మలకు రెస్ట్ ఇవ్వడంతో రెండో వన్డేలో వెస్టిండీస్ చేతుల్లో చిత్తుగా ఓడింది టీమిండియా...
Team India
‘నాకు తెలిసి టీమిండియాకి ఇప్పటిదాకా బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో క్లారిటీ వచ్చినట్టు లేదు.టీ20ల్లో సూర్య అదరగొడుతున్నాడు... అయితే వన్డే ఫార్మాట్‌లో అతను పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు.
కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇంకా కోలుకోకపోవడంతో మిడిల్ ఆర్డర్‌లో ఎవరిని ఆడించాలో టీమిండియాకి తెలియడం లేదు. అందుకే బ్యాటింగ్ ఆర్డర్‌లో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు...
నిజం చెప్పాలంటే నాకు ఇలాంటి మార్పులు పెద్దగా నచ్చవు. వన్డే వరల్డ్ కప్ వంటి టోర్నీల ముందు 11-12 మంది ప్లేయర్లను వరుసగా మ్యాచులు ఆడిస్తే... టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై ఓ క్లారిటీ వస్తుంది... ఒకే టీమ్‌ని అన్నీ మ్యాచుల్లో కొనసాగిస్తే, ప్లేయర్లను పరీక్షించినట్టు అవుతుంది..
యజ్వేంద్ర చాహాల్‌ని కూర్చోబెట్టి, అక్షర్ పటేల్‌ని ఆడించారు. కుల్దీప్ యాదవ్‌తో పాటు బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్‌ని వన్డే వరల్డ్ కప్‌లో ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ అనుకుంటున్నట్టు ఉంది.
అయితే ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో చాహాల్ వంటి స్పిన్నర్ అవసరం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా టెస్టు ప్లేయర్ హనుమ విహారి.
Sanju Samson
సూర్యకుమార్ యాదవ్‌ని వన్డేల్లో ఇరికించాలనే ప్రయత్నాలు ఆపి, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ వంటి ప్లేయర్లను వన్డేల్లో ఆడిస్తే... మంచి ఫలితాలు వస్తాయని టీమిండియా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా ఓ ప్లానింగ్‌తో టీమ్‌లో మార్పులు చేయాలని ట్రోల్ చేస్తున్నారు..