MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • National Youth Day 2024: 'నాడు జీరోలు.. నేడు హీరోలు..' టీమిండియా యంగ్ ప్లేయర్స్ సక్సెస్ స్టోరీస్.. 

National Youth Day 2024: 'నాడు జీరోలు.. నేడు హీరోలు..' టీమిండియా యంగ్ ప్లేయర్స్ సక్సెస్ స్టోరీస్.. 

National Youth Day 2024: ప్రపంచానికి భారత సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను పరిచయం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద (Swami Vivekananda). ఆయన బోధనలు ఎప్పుడూ యువతకు స్ఫూర్తిధాయకమే. ఆయన ప్రసంగాలు యువకుల్లో నిత్యం చైతన్యం నింపుతునే ఉంటాయి. అందుకే ఆయన జయంతిని (జనవరి 12న) జాతీయ యువజన దినోత్సవం లేదా నేషనల్ యూత్ డే (National Youth Day) నిర్వహించుకుంటాం. ఈ రోజునే యువ దివస్ అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా గతేడాది క్రికెట్ లో రాణించిన యువ ఆటగాళ్ల ఇన్స్ ప్రెషన్ స్టోరీస్ మీ కోసం.  

2 Min read
Rajesh K
Published : Jan 12 2024, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
india shubhman gill.j

india shubhman gill.j

రైతుబిడ్డ Shubman Gill: పంజాబ్ లోని రైతు కుటుంబానికి చెందిన శుభ్‌మన్ గిల్.. చిన్న వయసులోనే టీమిండియాలోకి వచ్చి స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు.    నాలుగేళ్ల కిందట టీమిండియాలో అడుగుపెట్టిన శుభ్‌మన్ గతేడాది మొదట్లో వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయసు ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఏడాదిన్నర కాలంగా నిలకడగా రాణిస్తూ.. ఇప్పుడు టీమిండియాకు కీలకంగా మారాడు. భారత క్రికెట్ జట్టు తదుపరి కెప్టెన్‌గా ప్రశంసించబడుతున్నాడు.

25
పానీపూరీ వాలా.. యశస్వి జైస్వాల్

పానీపూరీ వాలా.. యశస్వి జైస్వాల్

యశస్వి జైస్వాల్ టీమిండియాలో అత్యంత ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లలో ఒకరు. ఉత్తరప్రదేశ్‌లోని భదోహికి చెందిన ఈ యువ క్రికెటర్ కథ అందరికీ తెలిసిందే. చిన్ననాటి నుంచి క్రికెట్ మీద పిచ్చి.. ఎలాగైనా క్రికెటర్ కావాలనేది అతని కల.. ఆ కలను నేరవేర్చుకునేందు ఎన్నో అవరోధాలను అదిరోహించారు. ఓ క్రమంలో పానీపూరీ అమ్ముతూ.. క్రికెట్ ట్రెనింగ్ కొనసాగించాడు. అలా తన కష్టాలే తనలో కసిని పెంచాయి. ఎదగాలనే కోరికకు బీజం వేశాయి. ఒక్కప్పుడు పానీ పూరి అమ్మిన అతను ఇప్పుడు పరుగుల వీరుడయ్యాడు. మరోవైపు.. ఐపీఎల్‌లో కోట్లాది రూపాయలు ఆర్జించిన యశస్వి సక్సెస్ అయ్యాడు. 22 ఏళ్ల యశస్వి టీమిండియా కోసం ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు.  అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన చాలా సింపుల్‌గా ఉంటాడు.  

35
Tilak Varma ఎలక్ట్రీషియన్ కొడుకు.. తిలక్ వర్మ

Tilak Varma ఎలక్ట్రీషియన్ కొడుకు.. తిలక్ వర్మ

ఎలక్ట్రీషియన్ కొడుకు తిలక్ వర్మ.. నిరుపేద కుటుంబం నుంచి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. టీమిండియాలో అత్యుత్తమ యువ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అతను ఇప్పటికే ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. గతేడాది చివరిలో జరిగిన వెస్టిండీస్ పర్యటనలో తిలక్ వర్మ టీ20 లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ ఏడాది అతనికి మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని, 21 ఏళ్ల తిలక్ కచ్చితంగా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోగలడని ఫ్యాన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

45
ఒకప్పటి స్వీపర్.. ఇప్పుడూ హిట్టర్..

ఒకప్పటి స్వీపర్.. ఇప్పుడూ హిట్టర్..

రింకూ సింగ్.. ఐపీఎల్ చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి ఒకసారి వెలుగులోకి వచ్చిన రింకూ సింగ్ గురించి అందరికీ తెలిసిందే. 26 ఏళ్ల రింకూ దేశంలోనే బెస్ట్ యంగ్ ఫినిషర్. ఒకప్పుడు పొట్టకూటి కోసం స్వీపర్ గా పని చేసిన అతడు.. క్రికెట్ మీద ఇష్టంతో ఎలాగైనా టీమిండియాలో అడుగుపెట్టాలని కసిపెంచుకున్నాడు. బీసీసీఐ రిజెక్ట్ చేసినా.. ఆ తర్వత ఐపీఎల్ రూపంలో అంది వచ్చినా అవకాశాన్ని చేజారకుండా  సద్వినియోగం చేసుకున్నాడు. ఐపీఎల్ తర్వాత రింకూ సింగ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా బెస్ట్  ఫినిషర్‌గా నిరూపించుకుంది.  అతనికి మరిన్ని అవకాశాలు వచ్చే సమయం ఆసన్నమైంది.. తద్వారా అతను ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడి భారత క్రికెట్ అభిమానుల హృదయాల్లో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలరు.

55
రవి బిష్ణోయ్

రవి బిష్ణోయ్

23 ఏళ్ల రవి బిష్ణోయ్ కూడా దేశంలోని అత్యుత్తమ వర్ధమాన ఆటగాళ్లలో ఒకడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ వంటి సీనియర్ ఆటగాళ్ల కారణంగా బిష్ణోయ్‌కు కంటిన్యూగా ఆడే అవకాశం రాకపోయినా.. ఆడే అవకాశం వచ్చినప్పుడల్లా దుమ్మురేపుతున్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ కు తన లెగ్‌ స్పిన్ బౌలింగ్ తో చుక్కలు చూపిస్తున్నాడు. ఇలా గతేడాది టీ20 ర్యాంకింగ్స్‌లో బిష్ణోయ్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ఏడాది కూడా అవకాశం దొరికితే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను తన స్పిన్‌కు డ్యాన్స్ చేసి ఎన్నో వికెట్లు తీసి పేరు తెచ్చుకోవచ్చు.

About the Author

RK
Rajesh K
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cricketers Assault : ఎంతకు తెగించార్రా..గ్రౌండ్ లోనే క్రికెట్ కోచ్‌ తల పగలగొట్టిన ప్లేయర్స్ !
Recommended image2
IPL Brand Value: ఐపీఎల్ జట్లకు బిగ్ షాక్.. సన్‌రైజర్స్, ఆర్సీబీ బ్రాండ్ విలువ ఢమాల్ ! కష్టమేనా?
Recommended image3
ICC Rankings : వన్డే కింగ్ ఎవరు? రోహిత్ శర్మకు ఎసరు పెట్టిన విరాట్ కోహ్లీ.. కేవలం 8 పాయింట్లు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved