తృటిలో తప్పించుకున్నారు.. చావును చాలా దగ్గరగా చూసిన టాప్-5 క్రికెటర్లు వీరే
Luckiest cricketers: టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ 2022లో ఘోర ప్రమాదానికి గురయ్యాడు. చావు అంచువరకు వెళ్లి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
Rishabh pant, shami, Nicholas Pooran
Luckiest cricketers: ప్రపంచ క్రికెట్‌లో చావును చాలా దగ్గరగా చూసిన క్రికెటర్లు ఉన్నారు. మరణం అంచు వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ క్రికెటర్ల వైపు అదృష్టం లేకుంటే ఏదైనా జరిగి ఉండేది. ఈ ఘోర ప్రమాదాలతో బయటపడి ఇప్పుడు ప్రపంచ క్రికెట్ ను ఏలుతున్నారు. కాబట్టి వీరు చాలా అదృష్టంతులై useన క్రికెటర్లుగా చెప్పవచ్చు. అలాంటి టాప్-5 ప్లేయర్లను గమనిస్తే ఈ జాబితాలో భారత్‌కు చెందిన ముగ్గురు పెద్ద స్టార్లు వున్నారు. ఆ స్టార్ క్రికెటర్ల గురించిన వివరాలు మీకోసం..
Mohammed Shami
1. మహ్మద్ షమీ (భారత్)
భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ 2018లో డెహ్రాడూన్ నుంచి న్యూఢిల్లీకి వస్తుండగా కారు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో, షమీ తలకు కుడి కన్ను పైన గాయమైంది, దానిపై కొన్ని కుట్లు కూడా పడ్డాయి. ఆ ప్రమాదం జరిగిన సమయంలో షమీ, అతని భార్య హసిన్ జహాన్‌ల మధ్య గొడవ జరిగింది. అయితే ప్రమాదం నుంచి కోలుకున్న షమీ క్రికెట్ గ్రౌండ్ లో అద్భుతంగా పునరాగమనం చేశాడు.
2. కరుణ్ నాయర్ (భారత్)
టీమిండియా బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన ఘనత సాధించాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత, నాయర్ 2016లో చెన్నైలో ఆడుతూ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అదే సంవత్సరం కరుణ్ నాయర్ ప్రమాదానికి గురయ్యాడు. జూలై 2016లో, అతను కేరళలో విహారయాత్రలో ఉన్నాడు. కరుణ్ తన బంధువులతో కలిసి పంపా నది అవతల పడవలో ఒక ఆలయానికి వెళుతుండగా, పడవ ప్రమాదానికి గురైంది. అయితే చుట్టుపక్కల గ్రామస్తులు అతడిని కాపాడారు. ఆ ప్రమాదంలో కరుణ్ నాయర్ చాలా మంది బంధువులను కోల్పోయారు.
3. ఒషానే థామస్ (వెస్టిండీస్)
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ ఒషానే థామస్ ఫిబ్రవరి 2020లో జమైకాలో పెద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో థామస్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా బోల్తాపడగా, హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో వైద్యులు ఒషానే థామస్‌ను ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా థామస్ త్వరగా కోలుకుని క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చాడు.
Nicholas Pooran
4. నికోలస్ పూరన్ (వెస్టిండీస్)
నికోలస్ పూరన్‌ను వెస్టిండీస్ క్రికెట్ జట్టు భవిష్యత్తుగా భావిస్తారు. ఇప్పుడు అతనొక సూపర్ స్టార్ ప్లేయర్. జనవరి 2015లో నికోలస్ పురాన్ ఘోర ప్రమాదానికి గురయ్యాడు. నడవలేని స్థితిలోకి జారుకున్నాడు. ట్రినిడాడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అతని రెండు కాళ్ళకు శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. నికోలస్ పురాన్ నెలల తరబడి వీల్ చైర్ లోనే వున్నాడు. ఆ తర్వాత కోలుకొని క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు.
5. రిషబ్ పంత్ (భారత్)
30 డిసెంబర్ 2022 తెల్లవారుజామున భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ BMW కారు ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంతో పంత్ చాలా గాయపడ్డాడు. ఈ ప్రమాదం నుండి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. భారత జట్టులోకి తిరిగి రావడానికి ఒకటిన్నర సంవత్సరాలకు పైగా పట్టింది. ప్రమాదంలో రిషబ్ పంత్ తల, వీపు, కాళ్లకు గాయాలయ్యాయి. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ప్రయత్నించి కోలుకున్న తర్వాత ఐపీఎల్ తో క్రికెట్ గ్రౌండ్ లోకి మళ్ళీ అడుగు పెట్టాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 తో భారత జట్టులోకి తిరిగి వచ్చాడు.