- Home
- Sports
- Cricket
- మురళీ విజయ్, విజయ్ శంకర్, కేదార్ జాదవ్... ఐపీఎల్ 2022 మెగా వేలంలో ‘అన్ సోల్డ్’ ప్లేయర్లు వీళ్లే...
మురళీ విజయ్, విజయ్ శంకర్, కేదార్ జాదవ్... ఐపీఎల్ 2022 మెగా వేలంలో ‘అన్ సోల్డ్’ ప్లేయర్లు వీళ్లే...
ఐపీఎల్ మెగా వేలానికి కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఏ ప్లేయర్, మెగా వేలం లాటరీలో కోట్లు కొల్లగొడుతాడో, ఏ ప్లేయర్ కోసం ఫ్రాంఛైజీలు కొట్టుకుంటాయోనని ఐపీఎల్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...

ఐపీఎల్ వేలంలో ఏ ప్లేయర్‌కి ఎంత ధర దక్కుతుందో అంచనా వేయడం కష్టమే. ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్ డేవిడ్ మలాన్ కేవలం రూ.కోటి దక్కించుకుంటే, ఏ మాత్రం అనుభవం లేని కృష్ణప్ప గౌతమ్‌ను రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసింది సీఎస్‌కే...
అయితే ఈసారి మెగా వేలంలో కొందరు సీనియర్ ప్లేయర్లు అమ్ముడుపోవడం కష్టమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు... వారిలో మురళీ విజయ్, కేదార్ జాదవ్ వంటి ప్లేయర్లు ముందువరసలో ఉన్నారు...
మురళీ విజయ్: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్‌గా కొన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన మురళీ విజయ్, ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ అమ్ముడుపోలేదు. 37 ఏళ్ల వయసులో దేశవాళీ క్రికెట్ టోర్నీలకూ దూరంగా ఉంటున్న మురళీ విజయ్, ఈసారి అమ్ముడుపోతే అదే పెద్ద విశేషమే అవుతుంది...
అజింకా రహానే: రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కి కెప్టెన్‌గానూ చేసిన అజింకా రహానే, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లకు ఆడాడు. ఐపీఎల్ దాదాపు 4 వేల పరుగులు చేసిన రహానేకి గత రెండు సీజన్లుగా సరిగా అవకాశాలు కూడా దక్కడం లేదు...
స్టీవ్ స్మిత్: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పూణే వారియర్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లకు ఆడడమే కాకుండా కెప్టెన్సీ కూడా చేశాడు. అయితే ఐపీఎల్‌లో దాదాపు 2500 పరుగులు చేసిన స్మిత్, మూడు సీజన్లుగా సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. గత సీజన్‌లో బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు స్మిత్‌ను కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ సారి కూడా అతను అంతకంటే ఎక్కువ ధర పలకకపోవచ్చు...
ఆరోన్ ఫించ్: ఐపీఎల్‌లో ఇప్పటిదాకా 8 జట్లకి ఆడిన ఆరోన్ ఫించ్, గత ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. ఈసారి కూడా అతన్ని కొనుగోలు చేయడానికి ఏ జట్టైనా ముందువస్తుందా? అనేది అనుమానమే...
ఇయాన్ మోర్గాన్: కెప్టెన్‌గా కేకేఆర్‌ని ఫైనల్ చేర్చిన ఇయాన్ మోర్గాన్, బ్యాట్స్‌మెన్‌గా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 17 మ్యాచుల్లో 133 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మోర్గాన్‌ని ఈసారి ఐపీఎల్ వేలంలో ఏ జట్టు కొంటుందనేది ఆసక్తికర అంశమే..
ఛతేశ్వర్ పూజారా: టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారాని, గత సీజన్‌లో సీఎస్‌కే బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఒక్క మ్యాచ్ ఆడించలేదు. ఈసారి అతన్ని ఏ జట్టూ కొనుగోలు చేయకపోవచ్చు.
హనుమ విహారి: తెలుగు క్రికెటర్ హనుమ విహారి, గత రెండు ఐపీఎల్ సీజన్లలోనూ అమ్ముడుపోలేదు. ఈసారి కూడా అతన్ని కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించకపోవచ్చు.
ఇషాంత్ శర్మ: భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, గత ఐపీఎల్‌లో గాయం కారణంగా తప్పుకున్నాడు. మూడు మ్యాచులు ఆడినా ఒకే వికెట్ తీయగలిగాడు. ఇషాంత్‌ను కొనుగోలు చేయడానికి ఏ జట్టు ఆసక్తి చూపించకపోవచ్చని అంచనా...
అమిత్ మిశ్రా: భారత సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, గత ఐపీఎల్‌లో 4 మ్యాచులు ఆడి 6 వికెట్లు తీయగలిగాడు. అయితే గాయాలతో సతమతమవుతున్న మిశ్రా బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు. అతని కోసం ఆ మొత్తం చెల్లించేందుకు ఏ జట్టు ఆసక్తి చూపిస్తుందనేది అనుమానమే.
విజయ్ శంకర్: లక్కీగా 2019 వన్డే వరల్డ్‌కప్ ఆడిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, ఐపీఎల్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన ప్లేయర్లలో ఒకడు. గత 2021 సీజన్‌లో 7 మ్యాచులు ఆడిన విజయ్ శంకర్, 58 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బౌలింగ్‌లో 3 వికెట్లు తీశాడు...
కేదార్ జాదవ్: భారత సీనియర్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్, ఇప్పటిదాకా ఐపీఎల్‌లో 12 సీజన్లు ఆడాడు. గత రెండు సీజన్లలో కలిపి 117 పరుగులు చేసిన జాదవ్‌ని ఈసారి ఏ జట్టైనా కొనుగోలు చేసిందంటే అది ఆశ్చర్యకరమైన విషయమే అవుతుంది...