ముంబై ఇండియన్స్‌తో దుబాయ్‌కి 150 మంది... టైలర్, మేకప్ ఆర్టిస్ట్,హెయిర్ డ్రెస్సర్‌తో సహా...
ఐపీఎల్ 2020 సీజన్‌ను బయో బబుల్‌లో అనేక కఠిన నిబంధనల నడుమ నిర్వహించిన సంగతి తెలిసిందే. క్రికెటర్లు, వారి కుటుంబసభ్యులను మినహా బయటి వ్యక్తులకు మ్యాచులు చూసే అవకాశం కల్పించలేదు ఐపీఎల్ నిర్వహాకులు. ఐపీఎల్ 2020 సీజన్‌ను విజయవంతంగా ముగించిన బీసీసీఐ, యూఏఈలో లీగ్ నిర్వహణ ఎలా చేసింది, ఏ విధంగా నిర్వహించింది తదితర విషయాలను వెల్లడించింది...
ఐపీఎల్ సీజన్ 2020 ప్రారంభానికి 20 రోజుల ముందే ఆటగాళ్లు యూఈఏ చేరుకున్నారు. కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాత 14 రోజుల క్వారంటైన్‌లో గడిపారు... ఆటగాళ్లతో పాటు జట్టు సహా యజమానులు కూడా ఈ టెస్టులు, క్వారంటైన్‌ను తప్పక ఫాలో కావాల్సిందే.
ఐపీఎల్ 2020 సీజన్‌లో 15 మంది ప్లేయర్లను మాత్రమే ఆడించిన ఛాంపియన్ ముంబై ఇండియన్స్... తమతో పాటు 150 మంది సభ్యులను యూఏఈకి తీసుకెళ్లిందట...
ముంబై ఇండియన్స్‌తో దుబాయ్‌కి పయనించినవారిలో హెయిర్ డ్రెస్సర్, మేకప్ ఆర్టిస్టుతో పాటు ఓ టైలర్ కూడా ఉన్నాడట... అత్యంత కాస్ట్‌లీ టీమ్ అయిన ముంబై, ఆటగాళ్లతో పాటు యజమాని నీతూ అంబానీ కోసం ఇంత మందిని వెంట తీసుకెళ్లిందట.
ముంబై ఇండియన్స్‌తో పోలిస్తే మిగిలిన అన్ని ఫ్రాంఛైజీల వెంట వచ్చిన సభ్యుల సంఖ్య 40 మందిని కూడా మించలేదట... రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్యతో పాటు చాహాల్ ప్రియురాలు ధనుశ్రీ వర్మ కూడా యూఏఈ చేరింది.
ఇలా ఆటగాళ్లు, వారి కుటుంబసభ్యులతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌తో కూడా మొత్తంగా ఐపీఎల్ 2020 సమయంలో 30 వేల కరోనా టెస్టులు నిర్వహించారట...
సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు 11 మంది సహాయ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే... వీరికి ప్రత్యేక గదుల్లో ఐసోలేషన్ అందించింది బీసీసీఐ.
అలాగే ఒకవేళ ఏ ఆటగాడికైనా కరోనా సోకితే... ఐసోలేషన్‌లో ఉంచేందుకు వీలుగా 300 ప్రత్యేక గదులను కూడా బ్లాక్ చేసి పెట్టింది బీసీసీఐ...
ఐపీఎల్ 2020 ద్వారా భారత క్రికెట్ బోర్డుకి రూ.4000 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పిన బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ దుమాల్, టీవీ వ్యూయర్‌షిప్ 25 శాతం పెరిగిందని చెప్పాడు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 13కి వేదిక నిచ్చిన యూఏఈకి దాదాపు 100 కోట్ల రూపాయలు చెల్లించిన బీసీసీఐ, భారతదేశానికి దూరంగా లీగ్ నిర్వహించడం వల్ల వ్యయం 35 శాతం తగ్గిందని చెప్పాడు.
బయో బబుల్‌లో నిర్వహించిన సీజన్ కోసం అనేక ప్రత్యేక ఏర్పాట్లు చేసిన బీసీసీఐ... స్టేడియానికి జనాలు రాకపోయినా టీవీల్లో మ్యాచ్ వీక్షించేవారికి ఆ విషయం తెలియకుండా ఏర్పాట్లు చేశారు...