- Home
- Sports
- Cricket
- బుమ్రా ప్లేస్‌లో కత్తిలాంటి బౌలర్‌ని పట్టిన ముంబై ఇండియన్స్...వేలంలో అమ్ముడుపోని సందీప్ శర్మకు లక్కీ...
బుమ్రా ప్లేస్‌లో కత్తిలాంటి బౌలర్‌ని పట్టిన ముంబై ఇండియన్స్...వేలంలో అమ్ముడుపోని సందీప్ శర్మకు లక్కీ...
ఫైవ్ టైం ఐపీఎల్ టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్ గత రెండు సీజన్లలోనూ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. 2021 సీజన్‌లో నెట్ రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్స్ చేరలేకపోయిన ముంబై ఇండియన్స్, 2022 సీజన్‌లో అయితే 14 మ్యాచుల్లో 10 పరాజయాలు అందుకుని, ఆఖరి స్థానంలో నిలిచింది...

Jasprit Bumrah
ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా తప్పుకుంటున్నట్టు తేలడంతో ముంబై ఇండియన్స్ టీమ్‌కి షాక్ తగిలింది. బుమ్రా లేకపోయినా జోఫ్రా ఆర్చర్, జే రిచర్డ్‌సన్‌లతో కథ నడిపిద్దాం అనుకుంటే... ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్ కూడా గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ ఆడడం అనుమానంగా మారింది...
అయితే గాయపడిన జస్ప్రిత్ బుమ్రా స్థానంలో ఓ మంచి డొమెస్టిక్ బౌలర్‌ని పట్టుకుంది ముంబై ఇండియన్స్... పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన ఐపీఎల్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన సందీప్ శర్మను, బుమ్రా స్థానంలో ఆడించేందుకు ప్రయత్నిస్తోంది ముంబై ఇండియన్స్. డీల్ దాదాపు ఓకే అయినట్టు, అధికారిక ప్రకటన త్వరలో రాబోతున్నట్టు సమాచారం..
నాలుగు సీజన్ల పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కీ-బౌలర్‌గా ఉన్న సందీప్ శర్మ, ఐపీఎల్ 2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్‌కి వెళ్లాడు. 2018లో సందీప్ శర్మను రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 2022 మెగా వేలంలో బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకే పంజాబ్ కింగ్స్‌లోకి వెళ్లాడు సందీప్.
2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున 5 మ్యాచులు ఆడిన సందీప్ శర్మ, 20 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో అతన్ని వేలానికి వదిలేసింది పంజాబ్ యాజమాన్యం... ఐపీఎల్ 2023 మినీ వేలంలో దారుణ అవమానం ఎదురైంది. ఐపీఎల్‌లో 114 వికెట్లు తీసిన సందీప్ శర్మను ఏ ఫ్రాంఛైజీ కూడా కొనుగోలు చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.
2010, 2012 అండర్ 19 వరల్డ్ కప్స్ ఆడిన సందీప్ శర్మ, 2013లో ఐపీఎల్‌లో ఆరంగ్రేటం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి అదరగొట్టాడు సందీప్ శర్మ... 2017లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌లను అవుట్ చేసిన సందీప్ శర్మ, ఒకే మ్యాచ్‌లో ఈ ముగ్గురినీ అవుట్ చేసిన మొట్టమొదటి బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
2014 సీజన్‌లో 18 వికెట్లు పడగొట్టిన సందీప్ శర్మ, పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.. ఐపీఎల్‌లో విరాట్‌ని ఏడు సార్లు అవుట్ చేసిన సందీప్ శర్మ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోహ్లీని అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్‌గా టాప్‌లో ఉన్నాడు.. ఆశీష్ నెహ్రా ఆరుసార్లు, బుమ్రా నాలుగు సార్లు మాత్రమే కోహ్లీ వికెట్ తీశారు...
virat kohli sandeep sharma
సందీప్ శర్మ బౌలింగ్‌లో ఐపీఎల్‌లో 72 బంతులను ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ, కేవలం 55 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఏడుసార్లు అవుట్ అయ్యాడు... ఐపీఎల్ కెరీర్‌లో సందీప్ శర్మ 92 ఇన్నింగ్స్‌ల్లో పవర్ ప్లేలో 53 వికెట్లు తీయగా... 99 ఇన్నింగ్స్‌ల్లో 52 వికెట్లు తీసిన జహీర్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు...
డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్‌లో స్టార్ బౌలర్‌గా వెలిగిన సందీప్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా లేని లోటు తీర్చగలడా? అంటే చెప్పడం కష్టమే. అయితే ఇప్పుడున్న అతి తక్కువ మంది బౌలర్లలో బుమ్రాని రిప్లేస్ చేయగల సరైన బౌలర్ సందీప్ శర్మనే...