- Home
- Sports
- Cricket
- వాట్ ఏ మ్యాచ్... కిరన్ పోలార్డ్ విధ్వంసం... ఆఖరి బంతిదాకా సాగిన మ్యాచ్‌లో ముంబై థ్రిల్లింగ్ విన్...
వాట్ ఏ మ్యాచ్... కిరన్ పోలార్డ్ విధ్వంసం... ఆఖరి బంతిదాకా సాగిన మ్యాచ్‌లో ముంబై థ్రిల్లింగ్ విన్...
IPL 2021లో సమవుజ్జీల మధ్య సమరం ఎలా ఉంటుందో, రెండు టాప్ టీమ్‌లు తలబడితే... ఎలా ఉంటుందో అలా సాగింది ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్... తొలుత చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అంబటి రాయుడు సిక్సర్ల మోత మోగిస్తే, ముంబై ఇండియన్స్ తరుపున కిరన్ పోలార్డ్ సిక్సర్ల సునామీ చూపించాడు...

219 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ముంబై ఇండియన్స్‌కి శుభారంభం దక్కింది. రెండో ఓవర్‌లోనే రోహిత్ శర్మను అవుట్‌గా ప్రకటించాడు అంపైర్. అయితే రివ్యూకి వెళ్లిన రోహిత్ శర్మకు అనుకూలంగా ఫలితం వచ్చింది.

24 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 71 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ముంబై ఇండియన్స్...

ఆ తర్వాత 3 పరుగులు మాత్రమే చేసిన సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ కాగా 28 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేసిన డి కాక్, మొయిన్ ఆలీ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 94 పరుగులు మాత్రమే చేసిన ముంబై ఇండియన్స్, మరో మ్యాచ్‌లో ఓటమి చవిచూస్తుందని అనిపించింది. అయితే జడ్డే వేసిన 13వ ఓవర్‌లో మూడు సిక్సర్లతో 18 పరుగులు రాబట్టాడు కిరన్ పోలార్డ్...

ఆ తర్వాత లుంగి ఇంగిడి వేసిన ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన పోలార్డ్, శార్దూల్ ఠాకూర్ వేసిన 15వ ఓవర్‌లో ఓ సిక్స్, మూడు ఫోర్లతో 23 పరుగులు రాబట్టాడు

17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న కిన్ పోలార్డ్‌కి జత కలిసిన కృనాల్ పాండ్యా, ఇంగిడి వేసిన 16వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు రాబట్టాడు.

అయితే 17వ ఓవర్ వేసిన సామ్ కుర్రాన్, సీఎస్‌కేకి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసిన కృనాల్ పాండ్యాను అవుట్ చేసిన సామ్ కుర్రాన్, ఆ ఓవర్‌లో కేవలం 2 పరుగులే ఇచ్చాడు.

18వ ఓవర్‌లో 17 పరుగులు రాగా, 19వ ఓవర్‌లో హార్ధిక్ పాండ్యా రెండు సిక్సర్లు బాదాడు. అయితే అతనితో పాటు జేమ్స్ నీశమ్‌ను అవుట్ చేశాడు సామ్ కుర్రాన్...

ఆ ఓవర్‌లో విజయానికి 16 పరుగులు కావాల్సిన దశలో మొదటి బంతికి పరుగులేమీ రాలేదు. రెండు, మూడో బంతులకు బౌండరీలు బాదాడు పోలార్డ్. 3 బంతుల్లో 8 పరుగులు కావాల్సిన దశలో నాలుగో బంతికి పరుగులేమీ రాలేదు...

ఆఖరి 2 బంతుల్లో 8 పరుగులు కావాల్సిన దశలో సిక్సర్ బాదాడు కిరన్ పోలార్డ్. ఆఖరి బంతికి 2 పరుగులు కావాల్సిన దశలో రెండు పరుగులు తీసి ముంబై ఇండియన్స్‌కి విజయాన్ని అందించాడు... 33 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు కిరన్ పోలార్డ్.

ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో విజయవంతమైన చేధనకాగా, 200+ లక్ష్యాన్ని చేధించడం ముంబై ఇండియన్స్‌కి ఇదే తొలిసారి... ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచిన సీఎస్‌కే జైత్రయాత్రకి బ్రేక్ ఇచ్చింది ముంబై...