MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • డ్రెస్సింగ్ రూమ్‌కి మెసేజ్ పంపేందుకు కోడ్ లాంగ్వేజ్ వాడిన ఎమ్మెస్ ధోనీ... గ్లవ్స్ అడిగాడంటే..

డ్రెస్సింగ్ రూమ్‌కి మెసేజ్ పంపేందుకు కోడ్ లాంగ్వేజ్ వాడిన ఎమ్మెస్ ధోనీ... గ్లవ్స్ అడిగాడంటే..

భారత మాజీ క్రికెటర్, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 41వ పుట్టినరోజు నేడు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న మాహీ, కెప్టెన్‌గా మారిన తర్వాత కోడ్ లాంగ్వేజ్‌ని విపరీతంగా వాడేవాడట. వికెట్ల వెనకాలనే కాకుండా బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనూ కోడ్ లాంగ్వేజ్ ద్వారా డ్రెస్సింగ్ రూమ్‌కి మెసేజ్‌లు పంపేవాడు మాహీ...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 07 2022, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

2004లో టీమిండియాలోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, 2007లో కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు. 2007 వన్డే వరల్డ్ కప్ తర్వాతే భారత జట్టులో మాహీ శకం ప్రారంభమైంది... కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ సాధించిన మాహీ, ప్రత్యర్థి జట్టుకి తెలియకుండా డ్రెస్సింగ్ రూమ్‌కి మెసేజ్ పంపేందుకు కొన్ని కోడ్ లాంగ్వేజ్‌లను వాడేవాడట...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

2008లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ గ్రౌండ్‌లో ఆసీస్‌తో కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది భారత జట్టు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోవడంతో రికీ పాంటింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్‌గా ఎమ్మెస్ ధోనీకి ఇది ఐదో వన్డే మాత్రమే...

38

లక్ష్యఛేదనలో టీమిండియా విజయానికి 10 పరుగుల దూరంలో నిలిచిన సమయంలో డ్రెస్సింగ్ రూమ్ నుంచి గ్లవ్స్ కోరుతూ సిగ్నల్ పంపించాడు క్రీజులో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ. అప్పటికే జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మతో బ్యాటింగ్ చేస్తున్న ధోనీ... గ్లవ్స్ కావాలని మెసేజ్ పంపడంతో భారత జట్టు షాక్ అయ్యింది.

48

నిజానికి మాహీ మ్యాచ్ అయిపోయే సమయంలో గ్లవ్స్ అడిగాడంటే దానికి అర్థం... మ్యాచ్ అయ్యాక, ఎవ్వరూ బాల్కనీలో సెలబ్రేట్ చేసుకోకూడదు... ఆస్ట్రేలియాపై విజయాన్ని మరీ పెద్దదిగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదనే మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ధోనీ ఇలా సూచించాడు...

58

క్రీజులో ఉన్న రోహిత్ శర్మకి కూడా మ్యాచ్ అయ్యాక వాళ్లు షేక్ హ్యాండ్ ఇస్తే... ఊరికే అలా ఫార్మల్‌గా చేతులు కలుపు. అంతేకానీ గెలిచాం కదా అని సెలబ్రేట్ చేసుకోకు. ఎలాంటి ఆనందం లేనట్టే ఉండు.. అని చెప్పాడు...

68

మాహీ ఇలా ఎందుకు చేశాడనే విషయం డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న చాలా మందికి అర్థం కాలేదు. అప్పటికే మూడు వరల్డ్ కప్స్ గెలిచిన ఆస్ట్రేలియా... క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తోంది...

78

అయితే ఆస్ట్రేలియాపై విజయం సాధించడం పెద్ద గొప్పేమీ కాదని, ఇకపై ఇలాంటి విజయాలు వరుసగా వస్తూనే ఉంటాయనే మెసేజ్‌ ఇచ్చేందుకు మాహీ అలా చేశాడు... కెప్టెన్‌గా ఎమ్మెస్ ధోనీ ఎంత మెచ్యూర్డ్ ఆలోచించేవాడో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలంటాడు ధోనీపై ‘ది ధోనీ టచ్’ పుస్తకం రాసిన భరత్ సుందరేశన్...

88

బ్యాటింగ్ చేస్తున్నప్పుడే కాకుండా వికెట్ కీపింగ్ సమయంలోనూ ఎమ్మెస్ ధోనీ కోడ్ లాంగ్వేజ్‌ని బాగా వాడేవడట. ఇది సదరు బౌలర్‌కి, కెప్టెన్ ధోనీకి తప్ప కొంతమంది ఫీల్డర్లకు కూడా అర్థం కాకపోయేదట.. 

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Recommended image2
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
Recommended image3
RRR vs HEC : ఏంటిది రెడ్డిగారు.. రంగారెడ్డితో అలా చెడుగుడు ఆడేసుకున్నారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved