అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ లను దాటేసిన ధోని.. దుమ్మురేపుతున్నాడుగా
MS Dhoni surpasses Amitabh Bachchan and Shah Rukh Khan : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 6 నెలల్లో 42 బ్రాండ్ ఒప్పందాలపై సంతకం చేసి సరికొత్త రికార్డు సాధించాడు. బాలీవుడ్ బడా స్టార్లను మించిపోయాడు.
మహేంద్ర సింగ్ ధోనీ
క్రికెట్‌లో ధోనీ స్థానం ప్రత్యేకమైనది. 'కెప్టెన్ కూల్' ధోనీ భారత జట్టుకు టీ20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్‌ను గెలిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా ఐపీఎల్‌లో దూకుడుగా ఆడుతున్న 'తల' ధోనీ, తమిళనాడు ప్రజల క్రికెట్ దేవుడంటే అతిశయోక్తి కాదు. తనదైన ఆటతో అంతర్జాతీయ క్రికెట్ లో ప్రత్యేక గుర్తింపు పొందిన ధోని బాలీవుడ్ బడా స్టార్లను దాటేశాడు. ఎలా దాటేశాడు? ఏ విషయంలో దాటేశాడు? అనే కదా మీ ప్రశ్న.. ఇప్పుడు అదే విషయం తెలుసుకుందాం.
ధోనీ సీఎస్కే
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా ధోని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఐపీఎలో లో ఆడుతున్న ధోని ప్రస్తుతం యంగ్ స్టార్ ప్లేయర్లతో పోటీ పడుతూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆటలోనే కాదు సంపాదనలోనూ దూసుకుపోతున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్ 41 బ్రాండ్ ఒప్పందాలు, షారుఖ్ ఖాన్ 34 బ్రాండ్ ఒప్పందాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ధోనీ వారిని అధిగమించాడు. సిట్రోయెన్, గరుడ ఏరోస్పేస్, మాస్టర్ కార్డ్ వంటి పెద్ద బ్రాండ్లతో ధోనీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాలీవుడ్ బడా స్టార్లను అధిగమిస్తూ తన క్రేజ్ ఎలాంటిదో మరోసారి చూపించాడు.
42 బ్రాండ్ ఒప్పందాలు
ప్రస్తుతం బాలీవుడ్ లో బడాస్టార్లను అధిగమిస్తూ ధోని ఏకంగా 42 బ్రాండ్ ఒప్పందాలు చేసుకున్నాడు. వీటితో భారీగానే సంపాదిస్తున్నాడు. ధోనీ ఆస్తుల గురించి చెప్పాలంటే, ఆయన స్వస్థలమైన రాంచీలో 7 ఎకరాల్లో 6 కోట్ల విలువైన ఫామ్‌హౌస్, డెహ్రాడూన్‌లో 18 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లా ఉన్నట్లు సమాచారం.
ధోనీ ఆస్తులు
అలాగే, హమ్మర్ H2, ఆడి, మెర్సిడెస్ బెంజ్, రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో, రోవర్ ఫ్రీలాండర్, మహీంద్రా స్కార్పియో వంటి కోట్ల, లక్షల రూపాయల విలువైన కార్లు ధోనీ వద్ద ఉన్నాయి. హార్లీ డేవిడ్సన్, డ్యుకాటీ 1098, కాన్ఫెడరేట్ హెలికాప్టర్ సహా దాదాపు 70 రకాల బైక్‌లు ధోనీ గ్యారేజీలో ఉన్నాయి.
కాగా, 2023లో ఫ్రాంచైజీని ఐదవ ఐపిఎల్ టైటిల్‌కు నడిపించిన తర్వాత ధోని సీఎస్కే కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ వచ్చాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు, 43 ఏళ్ల భారత మాజీ కెప్టెన్ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా చెన్నై టీమ్ రిటైన్ చేసుకుంది. ఐపిఎల్ కొత్త నిబంధనను ప్రవేశపెట్టిన తర్వాత, ఐదేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడని పక్షంలో ఫ్రాంచైజీలు అన్‌క్యాప్డ్ విభాగంలో ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతించారు. ధోనీతో పాటు గైక్వాడ్, రవీంద్ర జడేజా , మతీషా పతిరానా, శివమ్ దూబేలను కూడా సీఎస్కే రిటైన్ చేసుకుంది.