MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • నాలుగేళ్లు అయినా ఆ రనౌట్‌ని మరిచిపోని మహేంద్ర సింగ్ ధోనీ... ఆ రోజు ఆ పని చేయనుందుకు...

నాలుగేళ్లు అయినా ఆ రనౌట్‌ని మరిచిపోని మహేంద్ర సింగ్ ధోనీ... ఆ రోజు ఆ పని చేయనుందుకు...

వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీ గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచింది టీమిండియా. వరుస విజయాలతో సెమీ ఫైనల్ చేరిన భారత జట్టు, న్యూజిలాండ్ చేతుల్లో 18 పరుగుల తేడాతో ఓడింది. భారత జట్టు విజయానికి ఆఖరి 10 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన సమయంలో ధోనీ రనౌట్ కావడంతో మ్యాచ్ ఫలితం మారిపోయింది..

Chinthakindhi Ramu | Updated : Sep 21 2023, 11:54 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

టాపార్డర్, మిడిల్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్ కావడంతో 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. అయితే రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ కలిసి ఏడో వికెట్‌కి 116 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసిన జడేజా అవుటైన తర్వాతి ఓవర్‌లోనే ధోనీ రనౌట్ అయ్యాడు..

29
dhoni neesham

dhoni neesham

72 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసిన ధోనీకి అదే ఆఖరి అంతర్జాతీయ ఇన్నింగ్స్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. తన కెరీర్‌ని రనౌట్‌తో మొదలెట్టిన ధోనీ, రనౌట్‌తోనే ముగించడం విశేషం..

39
Asianet Image

స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందర్ తాజా ఇంటర్వ్యూలో ధోనీ, తనతో పంచుకున్న విశేషాలను బయటపెట్టాడు. ‘ధోనీ, తన ఐపాడ్‌లో ఫోటోలు చూస్తున్నాడు. వచ్చి నా పక్కన కూర్చో అన్నాడు. 2019 వరల్డ్ కప్ ఫోటో వచ్చింది. ఆ రోజు నేను డైవ్ చేసి ఉంటే... ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉండేది కదా అన్నాడు..
 

49
dhoni sad

dhoni sad

నేను ఆశ్చర్యపోయా. ధోనీ నాతో ఇలా అన్నాడు.. ‘‘సింగిల్ ఇంచ్... కేవలం సింగిల్ ఇంచ్.. ఇప్పటికీ నన్ను బాధపెడుతూ ఉంది. ఆ రోజు నేను డైవ్ చేసి ఉంటే, బాగుండేదని అనిపిస్తుంది. మార్టిన్ గప్టిల్ బాల్ అందుకుని త్రో వేయడం నేను చూశా. డైవ్ చేయాలా వద్దా అనుకుంటున్నా..

59
Asianet Image

అయితే కొద్ది దూరం వెళ్లాక డైవ్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. రిప్లై చూశాక డైవ్ చేసి ఉంటే, అవుట్ అయ్యేవాడని కాదని అర్థమైంది. అయితే నా కెరీర్‌లో నేనెప్పుడూ కూడా డైవ్ చేయలేదు. అందుకే ఈజీగా లైన్ దాటేస్తానని అనుకున్నా..

69
MS Dhoni

MS Dhoni

అది డైరెక్ట్ త్రో కాకపోయి ఉంటే, నేను కచ్ఛితంగా రనౌట్ కాకపోయేవాడిని. అర ఇంచు గ్యాప్‌లో రనౌట్ అయిపోయా. నా కెరీర్‌లో మొదటి మ్యాచ్ రనౌట్ అయ్యా, ఆఖరి మ్యాచ్‌లోనూ రనౌట్ అయ్యా. అదే నా ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అని నాకు తెలుసు. పెవిలియన్‌కి వెళ్లేటప్పుడు నా మైండ్‌లో ఇదే తిరుగుతోంది..

79
ms dhoni

ms dhoni

ఆ అర ఇంచు ఇప్పటిదాకా నా మెదడుని తొలిచేస్తూ ఉంది. చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. అప్పుడు నేను రనౌట్ కాకపోయినా ఇంకా 20+ పరుగులు కావాలని, మ్యాచ్ టీమిండియా గెలిచేది కాదని చాలామంది అనుకుంటున్నారు. 

89
Asianet Image

అయితే ఆఖరి ఓవర్ జేమ్స్ నీశమ్ వేస్తాడని నాకు తెలుసు. అతని ఓవర్‌లో మూడు సిక్సర్లు కొట్టడం నాకు పెద్ద కష్టమేమీ కాదు...’’ అని చెప్పాడు. ఆయన మాటలు విని నాకు ఆశ్చర్యమేసింది.

99
MS Dhoni

MS Dhoni

టీమిండియాకి ఎన్నో మ్యాచులు గెలిపించిన మనిషి, ఆ ఒక్క మ్యాచ్‌లో రనౌట్ అయినందుకు ఇంతలా ఫీలవుతున్నాడా? అనిపించింది..’ అంటూ చెప్పుకొచ్చాడు బోరియా మజుందర్... 

Chinthakindhi Ramu
About the Author
Chinthakindhi Ramu
 
Recommended Stories
Top Stories