MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • విజయ్ సినిమాలో మహేంద్ర సింగ్ ధోనీ... ‘తలపతి’ సినిమాలో ‘తలైవా’ నటించబోతున్నాడంటూ...

విజయ్ సినిమాలో మహేంద్ర సింగ్ ధోనీ... ‘తలపతి’ సినిమాలో ‘తలైవా’ నటించబోతున్నాడంటూ...

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని రెండేళ్లు దాటినా అతని ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. మాస్‌లో బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న మాహీకి తమిళనాడులో వీరాభిమానులు ఉన్నారు. ఈ క్రేజ్‌ని క్యాష్  చేసుకునేందుకు ఓ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌ని కూడా మొదలెట్టిన ధోనీ, ఓ కోలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడనే వార్త... మాహీ ఫ్యాన్స్‌ని ఊర్రూతలూగిస్తోంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Nov 14 2022, 06:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కోలీవుడ్ స్టార్ విజయ్, ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారిసు’ అనే సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో ‘వారసుడు’గా డబ్ అవుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ మూవీ స్టిల్స్ చూసిన ఫ్యాన్స్, తెలుగులో మహేష్ బాబుతో చేసిన ‘మహర్షి’ సినిమాని రీమేక్ చేయడం చేస్తున్నాడేమోనని అనుమానిస్తున్నారు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలయ్య బాబు నటిస్తున్న‘వీరసింహా రెడ్డి’, చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు కూడా సంక్రాంతి రేసులో ఉన్నాయి. ప్రభాస్ ‘ఆదిపురుష్’తో పాటు అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ కూడా సంక్రాంతికి విడుదల కావాల్సింది అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో పొంగల్ బరిలో దిగడం లేదు...

37

బాలయ్య, చిరూ సినిమాల కంటే ఎక్కువగా  తెలుగు రాష్ట్రాల్లో ‘వారసుడు’ సినిమా కోసం ఎక్కువ థియేటర్లను సీజ్ చేసి పెట్టుకున్నాడు ప్రొడ్యూసర్ దిల్ రాజు. అయితే సంక్రాంతి సమయంలో తెలుగు సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని టాలీవుడ్ నిర్మాతల కౌన్సిల్, దిల్ రాజుకి షాక్ ఇచ్చింది...

47

వారిసు విషయం పక్కనెబెడితే ఈ సినిమా ముగిసిన తర్వాత ‘విక్రమ్’ మూవీతో కోలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్ కొట్టిన డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు విజయ్. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మాస్టర్’‌కి ఆరంభంలో నెగిటివ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కలెక్షన్లు సాధించింది..

57

లోకేశ్ కనకరాజ్- విజయ్ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో మహేంద్ర సింగ్ ధోనీ ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నారట. ఇప్పుడు ఈ వార్త కోలీవుడ్‌లో తెగ వైరల్ అవుతోంది. ధోనీకి, విజయ్‌కీ మధ్య మంచి స్నేహం ఉంది. చాలా సందర్భాల్లో ఈ ఇద్దరూ కలిశారు. దీంతో విజయ్ సినిమాలో నటించేందుకు ధోనీని లోకేశ్ కనకరాజ్ ఒప్పించాడని తమిళ తంబీలు అంటున్నారు...

67

క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరూ కూడా కోలీవుడ్‌లో సినిమాలు చేశారు. దీంతో మాహీ కూడా వీరి దారిలోనే నడవబోతున్నాడా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది...

77
dhoni vijay

dhoni vijay

ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించిన ధోనీ, త్వరలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నాడు. దీంతో విజయ్‌ మూవీలో నటిస్తే, మాహీకి ఆ రకంగానూ వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నారు ట్రేడ్ పండితులు...  

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Orange Cap: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసు.. వైభవ్ రికార్డును గిల్, సుదర్శన్ బ్రేక్ చేస్తారా?
Recommended image2
Riyan Parag Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని రియాన్ పరాగ్ తిట్టాడా? వైరల్ వీడియో
Recommended image3
IPL 2026 Final: ఫైనల్‌కు వాన గండం.. మ్యాచ్ రద్దయితే ఐపీఎల్ ట్రోఫీ ఎవరికి దక్కుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved