మహీంద్రజాలం : భారత క్రికెట్ మీద చెరగని ముద్ర

First Published 16, Aug 2020, 10:13 AM

ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌, టీ20 వరల్డ్‌కప్‌, చాంపియన్స్‌ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్‌, దిగ్గజ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని శకం ముగిసింది. శనివారం రాత్రి 7.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు మహి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ప్రకటించాడు.

2020 ఐపీఎల్‌కు రంగం సిద్ధమైంది. టైటిల్‌ ఫేవరెట్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ కండిషనింగ్‌ క్యాంప్‌ నేటి నుంచి ఆరంభం. 2019 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌ తర్వాత మళ్లీ బ్యాట్‌ పట్టని మహి, తిరిగి జాతీయ జట్టులోకి వస్తాడా? లేడా? అని విశ్లేషకులు అంచనాల్లో మునిగారు. 2020 టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడటంతో మహి కెరీర్‌పై మళ్లీ చర్చ. ఇవేవీ పట్టని మహి కూల్‌గా చెన్నైకి చేరుకున్నాడు.

బయో బబుల్‌ ఐపీఎల్‌లో మహి ప్రదర్శనపై అభిమానులు, క్రికెట్‌ పండితులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వరల్డ్‌కప్‌లో ఆడే సత్తా తనలో ఉందని ధోని నిరూపించుకుంటాడనే విశ్వాసం అభిమానుల్లో స్పష్టంగా కనిపించింది. అందుకు తగినట్టే మహి నెట్స్‌లో కఠోరంగా సాధన చేస్తున్నాడు.

శుక్రవారం చెన్నైకి చేరుకున్న మహి.. శనివారం అభిమానులకు షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుం టున్నట్టు ప్రకటించాడు. శనివారం 19.29 గంటల నుంచి వీడ్కోలు తీసుకున్నట్టు పరిగణించాలని ధోని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి ఎం.ఎస్‌ ధోని తప్పుకున్నట్టు బీసీసీఐ సైతం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

నరాలు తెగే ఉత్కంఠతో కూడిన క్రికెట్‌లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడమెలాగో నేర్పాడు. ఒత్తిడితో కూడుకున్న ఛేదనలను నేర్పుగా ముగించటమెలాగో చూపించాడు. అంతఃప్రేరణతో అనూహ్య నిర్ణయాలు తీసుకుని ఔరా అనిపించాడు. కూల్‌గా ప్రపంచకప్‌లు సాధించే మార్గం చూపాడు.

ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌, టీ20 వరల్డ్‌కప్‌, చాంపియన్స్‌ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్‌, దిగ్గజ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని శకం ముగిసింది. శనివారం రాత్రి 7.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు మహి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ప్రకటించాడు. 2014లో టెస్టులకు గుడ్‌బై చెప్పినట్టే, ఐపీఎల్‌ 2020 కోసం చెన్నైకి చేరుకున్న ధోని కూల్‌గా తనదైన శైలిలో కెరీర్‌కు ముగింపు పలికాడు.ఈ ముగింపు ఎందరో అభిమానులకు గుండెకోతను మిగిల్చింది.

డిసెంబర్‌ 23, 2004లో బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన మహి.. జులై 10, 2019న మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌పై కెరీర్‌ ఆఖరి ఆట ఆడేశాడు. ఎం.ఎస్‌ ధోని 350వ వన్డే అతడి కెరీర్‌ చివరి మ్యాచ్‌.

సింపుల్ గా రిటైర్మెంట్...

39 ఏండ్ల 39 రోజులకు ఎం.ఎస్‌ ధోని క్రికెట్‌ కెరీర్‌ను ముగించాడు. ' థ్యాంక్స్‌. ఎనలేని మీ ప్రేమాభిమానాలు, మద్దతకు ధన్యవాదాలు. 19.29 గంటల నుంచి నేను రిటైర్‌ అయినట్టు భావించండి' అని ధోని తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు.

బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌ మొదలుకుని, 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌ వరకు చిత్రమాలికతో కూడిన వీడియోను బాలీవుడ్‌ గాయకుడు ముఖేశ్‌ పాటను జోడించి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఉంచాడు. రైల్వే నేపథ్యానికి గుర్తుగా వీడ్కోలు సమయాన్ని రైల్వే కాలమానిని ప్రకారం రాయటం విశేషం.

2014లో టెస్టు కెరీర్‌ను వీడ్కోలు మ్యాచ్‌ లేకుండా సాదాసీదాగా మహి., తాజాగా అంతర్జాతీయ కెరీర్‌ను సైతం అలాగే తేల్చేశాడు. ధోని తొలి, చివరి మ్యాచులు (చిట్టగాంగ్‌, మాంచెస్టర్‌) విదేశాల్లోనే జరుగటం యాధృచ్చికమే!.

భారత క్రికెట్ లో ప్రత్యేక స్థానం

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ, భారత క్రికెట్‌లో సచిన్‌ తర్వాత అంతటి ఆదరణ కలిగిన క్రికెటర్‌ ఎం.ఎస్‌ ధోని. క్రికెట్‌లో విస్మరించినబడిన రాష్ట్రం జార్ఖండ్‌ నుంచి వచ్చిన మహి.. ఒక్కో మెట్టు అంచెంచలుగా ఎదిగాడు.

వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడిన ధోని.. నాయకుడిగా బాధ్యతాయుత పాత్ర పోషించాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌తో మొదలైన మహి మేనియా.. 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ, టెస్టుల్లో వరల్డ్‌ నం.1 ర్యాంక్‌ (2009)వరకూ కొనసాగింది.

2011 వరల్డ్‌కప్‌ సమయంలో ధోని కెరీర్‌ ఉజ్వల స్థితిలో కొనసాగింది. జట్టులో సీనియర్లు, జూనియర్లతో గొప్ప సమన్వయం కుదుర్చుకున్న ధోని అద్భుతాలు చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో మరో కెప్టెన్‌కు సాధ్యపడని విధంగా ఐసీసీ ప్రధాన ట్రోఫీలు అన్నింటినీ సొంతం చేసుకున్నాడు.

ధోని స్టయిలే వేరు...

ప్రపంచ క్రికెట్‌ మరిచిపోలేని క్రికెటర్‌ ఎం.ఎస్‌ ధోని.. నిజానికి క్రికెట్‌ పుస్తకాల్లోంచి పుట్టిన ఆటగాడు కాదు. ధోని వికెట్‌ కీపింగ్‌ శైలి, బ్యాటింగ్‌ తీరు, టెక్నిక్‌ ఏవీ పర్‌ఫెక్ట్‌గా ఉండవు.

అన్నింటినీ తనదైన శైలిలో అలవర్చుకున్న ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ ప్రభంజనం సృష్టించాడు. విలక్షణ బ్యాటింగ్‌తో బౌలర్లను బెంబేలెత్తించాడు. హెలికాఫ్టర్‌ షాట్లతో యార్కర్లను నేరుగా స్టాండ్స్‌లోకి పంపించాడు.

జాతీయ జట్టు నాయకత్వ పగ్గాలు అందుకున్న ధోని, సారథ్యంలోనూ సొంత శైలినే అనుసరించాడు. మహి ప్రశాంతత, ఆటగాళ్లపై విశ్వాసంతో అద్భుత విజయాలు రాబట్టాడు.

నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న తరుణంలోనూ ధోని డ్రెస్సింగ్‌రూమ్‌, మైదానంలో యువ నాయకత్వానికి మార్గదర్శకుడి పాత్ర పోషించాడు. టెస్టు కెప్టెన్సీ విరాట్‌ కోహ్లికి అప్పగించి.. భారత జట్టు భవిష్యత్‌ దిశానిర్దేశం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలిగిన ధోని ఐపీఎల్‌లో ఆడనున్నాడు.

loader