ధోనీ, దేవుడితో సమానం! ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ సంచలన వ్యాఖ్యలు...
మాస్ ఫాలోయింగ్ విషయంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కూడా ధోనీకి పోటీ రాలేదు. కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడే బయోపిక్ విడుదల చేసిన ధోనీ, కెప్టెన్‌గా మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచి... బీభత్సమైన క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు..
మహేంద్ర సింగ్ ధోనీకి విదేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. వరుసగా మూడు వన్డే వరల్డ్ కస్ గెలిచిన ఆస్ట్రేలియాకి 2011 క్వార్టర్ ఫైనల్‌లో ఊహించని షాక్ ఇచ్చింది ధోనీ టీమ్...
తాజాగా ఆస్ట్రేలియా యంగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ఎమ్మెస్ ధోనీ ఓ దేవుడితో సమానం. చెన్నైలో ధోనీ గ్రౌండ్‌లోకి బ్యాటింగ్ రావడం చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి...
ధోనీతో పాటు ఓ రకమైన శక్తి నడుస్తూ ఉంటుంది. అతను చాలా చక్కని మనిషి. చాలా ప్రశాంతంగా మాట్లాడుతారు, ఎంతో చక్కగా పలకరిస్తాడు. తనతో గడిపిన క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి..’ అంటూ కామెంట్ చేశాడు కామెరూన్ గ్రీన్..
ప్రస్తుతం సౌతాఫ్రికాతో కలిసి వన్డే సిరీస్ ఆడుతోంది ఆస్ట్రేలియా. తొలి వన్డేలో కగిసో రబాడా బౌన్సర్ దెబ్బకు కామెరూన్ గ్రీన్ గాయపడ్డాడు. అతని స్థానంలో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా బ్యాటింగ్‌కి వచ్చిన మార్నస్ లబుషేన్ 80 పరుగులు చేసి మ్యాచ్‌ని గెలిపించాడు..
ముంబై ఇండియన్స్ తరుపున ఐపీఎల్ 2023 సీజన్ ఆడిన కామెరూన్ గ్రీన్, 16 మ్యాచుల్లో 160.28 స్ట్రైయిక్ రేటుతో 452 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 6 వికెట్లు తీశాడు..
Image credit: PTI
ఐపీఎల్ 2023 మినీ వేలంలో కామెరూన్ గ్రీన్‌ని రూ.17 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. ఐపీఎల్ చరిత్రలో సామ్ కుర్రాన్ (రూ.18.5 కోట్లు) తర్వాత అత్యధిక ఖరీదైన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కామెరూన్ గ్రీన్..