- Home
- Sports
- Cricket
- టీమిండియాకి ఇంకో షాక్! దీపక్ చాహార్‌కి తిరగబెట్టిన గాయం, బుమ్రా ప్లేస్‌లో ఆస్ట్రేలియాకి మహ్మద్ షమీ..
టీమిండియాకి ఇంకో షాక్! దీపక్ చాహార్‌కి తిరగబెట్టిన గాయం, బుమ్రా ప్లేస్‌లో ఆస్ట్రేలియాకి మహ్మద్ షమీ..
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ప్రకటించిన భారత జట్టులో జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే. జస్ప్రిత్ బుమ్రా వస్తాడు, ఆడతాడు అని ఆశాభావం వ్యక్తం చేసిన టీమిండియా మేనేజ్‌మెంట్‌కి నిరాశే ఎదురైంది. అయితే బుమ్రా గాయం కారణంగా పొట్టి ప్రపంచకప్‌కి దూరమైన ఇప్పటికీ అతనికి రిప్లేస్‌మెంట్‌ని ప్రకటించలేదు బీసీసీఐ...

Image credit: Getty
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ప్రకటించిన జట్టులో స్టాండ్ బై ప్లేయర్లుగా మహ్మద్ షమీ, దీపక్ చాహార్‌లకు చోటు దక్కింది. వీరిలో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడిన మహ్మద్ షమీ, ఆ తర్వాత ఐపీఎల్ 2022 మినహా ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు...
Mohammed Shami
జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్‌లను ప్రధాన పేసర్లుగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడించాలని ఫిక్స్ అయిన బీసీసీఐ మేనేజ్‌మెంట్, వీరితో పాటు అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ వంటి యంగ్ పేసర్లకు అవకాశాలు ఇస్తూ వచ్చింది..
Image credit: Getty
అయితే జస్ప్రిత్ బుమ్రా గాయపడడంతో ఇప్పుడు భారత జట్టుకి ఓ సీనియర్ ఫాస్ట్ బౌలర్ అవసరం పడింది. దీంతో ఏడాదిగా అంతర్జాతీయ టీ20 మ్యాచులకు దూరంగా ఉన్న మహ్మద్ షమీని తిరిగి పొట్టి ఫార్మాట్‌లోకి రప్పించింది... అయితే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి ముందు కరోనా బారిన పడిన షమీ, ఇప్పటిదాకా పూర్తిగా కోలుకోలేదు...
Image credit: PTI
దీంతో దీపక్ చాహార్‌కి టీ20 వరల్డ్ కప్ 2022లో చోటు దక్కడం ఖాయమనుకున్నారంతా. అయితే తాజాగా అతను మణికట్టు గాయంతో బాధపడుతున్నట్టు తేలింది. ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు గాయపడిన దీపక్ చాహార్, ఆరు నెలల పాటు క్రికెట్‌కి దూరమయ్యాడు...
Image credit: PTI
రీఎంట్రీ తర్వాత మంచి పర్ఫామెన్స్ కనబర్చిన దీపక్ చాహార్, ఆస్ట్రేలియాతో ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగిన టీ20 సిరీస్‌ల్లో ఆకట్టుకున్నాడు. అయితే అతని మణికట్టు ఎముక బెణికిందని, అందుకే సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో దీపక్ చాహార్ ఆడలేకపోయాడని సమాచారం...
Image credit: Getty
దీపక్ చాహార్ గాయంతో బాధపడుతుండడంతో జస్ప్రిత్ బుమ్రా స్థానంలో మహ్మద్ షమీ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడడం ఖాయంగా మారింది. గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో ఆఖరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన మహ్మద్ షమీ... ఏడాది తర్వాత మళ్లీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ ద్వారానే పొట్టి ఫార్మాట్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి...
Mohammed Shami
ఇప్పటికే 14 మంది భారత ప్లేయర్లు, సహాయక సిబ్బంది, కోచింగ్ స్టాఫ్‌తో కూడిన భారత బృందం... ఆస్ట్రేలియాకి చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టేసింది. మరో రెండు మూడు రోజుల్లో బుమ్రా ప్లేస్‌లో రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌ని అధికారికంగా ప్రకటించనుంది బీసీసీఐ. ఈలోపే షమీ, ఆస్ట్రేలియా చేరి భారత క్యాంపులో కలవబోతున్నాడట...