టీమిండియాకు మరో ఎదురుదెబ్బ: ఆస్ట్రేలియా సిరీస్ నుంచి షమీ అవుట్, జట్టులోకి వచ్చేదెవరంటే...
First Published Dec 21, 2020, 8:22 AM IST
పాత బంతితో చెలరేగే మహ్మద్ షమి ముంజేయి ఫ్రాక్చర్‌తో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి ఆస్ట్రేలియా పర్యటన నుంచి నిష్క్రమించాడు. ఆడిలైడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మహ్మద్ షమి గాయపడ్డ విషయం తెలిసిందే..!

బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా సుమారు పది మంది ఆటగాళ్లను గాయాల కారణంగా కోల్పోయింది. అందులో స్టార్ ఓపెనర్ డెవిడ్ వార్నర్ సైతం ఉన్నాడు. అయినా, ఆ జట్టు తొలి టెస్టులో విజయఢంకా మోగించింది. సిరీస్‌లో ఆధిక్యం సాధించింది. ఓ వైపు దారుణ ఓటమి భారాన్ని మోస్తున్న టీమ్ ఇండియా.. గాయం కారణంగా ప్రధాన పేసర్ సేవలు కోల్పోయింది. దీనితో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా అయింది.

పాత బంతితో చెలరేగే మహ్మద్ షమి ముంజేయి ఫ్రాక్చర్‌తో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి ఆస్ట్రేలియా పర్యటన నుంచి నిష్క్రమించాడు. ఆడిలైడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మహ్మద్ షమి గాయపడ్డ విషయం తెలిసిందే..!
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?