సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్, మహ్మద్ సిరాజ్ బ్యాటింగ్... పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ముందు టీమిండియా...
టీమిండియాలో స్టార్ ప్లేయర్లు, మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉన్నారు. అయితే 10 ఏళ్లుగా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా నెగ్గలేకపోయింది భారత జట్టు. స్వదేశంలో జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియానే ఫెవరెట్...
రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్వైపాక్షిక సిరీసుల్లో కూడా తేలిపోతున్న భారత జట్టు, ఆసియా కప్‌లో గ్రూప్ స్టేజీలో నేపాల్‌పై ఘన విజయం అందుకుంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యింది..
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, 48.5 ఓవర్లలో ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ 11, శుబ్‌మన్ గిల్ 10, విరాట్ కోహ్లీ 4, శ్రేయాస్ అయ్యర్ 14 పరుగులు చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యారు..
Image credit: PTI
ఇషాన్ కిషన్ 82, హార్ధిక్ పాండ్యా 87 పరుగులతో రాణించి ఐదో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నమోదు చేయడం వల్ల 266 పరుగుల డీసెంట్ స్కోరు చేయగలిగింది భారత జట్టు. అయితే పాక్‌తో మ్యాచ్‌లో లోయర్ ఆర్డర్‌లో రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ కూడా అనుకున్నంత రాణించలేకపోయారు..
టాపార్డర్ వైఫల్యంతో 66 పరుగులకే మొదటి 4 వికెట్లు పడ్డాయి. ఇషాన్ కిషన్, పాండ్యా కారణంగా 204/4కి చేరుకుంది టీమిండియా. అయితే 204 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన భారత జట్టు, 62 పరుగుల తేడాతో మిగిలిన 5 వికెట్లు కోల్పోయింది.
వన్డే వరల్డ్ కప్ 2023 ముందు లోయర్ ఆర్డర్‌లో కూడా పరుగులు రాబట్టేలా ప్రణాళికలు రచిస్తోంది భారత జట్టు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ముందు మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో ఎక్కువ సమయం గడిపారు..
Suryakumar Yadav
అలాగే సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజాకి బౌలింగ్ చేశాడు. పాక్‌తో మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ ఆడే అవకాశం ఉంది.ఒకవేళ అతన్ని ఆడించే ఉద్దేశం లేకపోతే శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో సూర్యకుమార్ యాదవ్‌ని తుది జట్టులోకి తేవాలని టీమిండియా భావిస్తున్నట్టు సమాచారం..
సూర్య వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. వన్డే వరల్డ్ కప్ ముందు అతను ఒక్క హాఫ్ సెంచరీ బాదినా, విమర్శకులకు సమాధానం చెప్పినట్టు అవుతుంది. అందుకే అతన్ని బ్యాటర్‌గా కాకుండా ఆల్‌రౌండర్‌గా తుది జట్టులోకి తెచ్చేందుకు టీమిండియా ఆలోచన చేయొచ్చు..
నేపాల్‌తో మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు నాలుగు క్యాచులు డ్రాప్ చేశారు. అలాగే పేలవ ఫీల్డింగ్‌తో నేపాల్ జట్టుకు అదనపు పరుగులు సమర్పించారు. అందుకే పాక్‌తో మ్యాచ్‌కి ముందు ఫీల్డింగ్ ప్రాక్టీస్‌పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది భారత జట్టు..