మహ్మద్ సిరాజ్, బుమ్రాలపై ‘రేసిజం’ కామెంట్స్... ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ...

First Published Jan 10, 2021, 5:59 AM IST

సిడ్నీ టెస్టులో భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. జాతి వివక్షకు కేంద్రమైన ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా ‘రేసిజం’ వ్యాఖ్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సిడ్నీ క్రికెట్ స్టేడియానికి హాజరైన కొందరు ప్రేక్షకులు... బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలపై ఇష్టం వచ్చినట్టుగా తిట్టారట.

సిరాజ్‌ను ‘కోతి’ అంటూ సిడ్ని క్రికెట్ గ్రౌండ్‌లోని ప్రేక్షకులు అవహేళన చేసినట్టు సమాచారం.

బుమ్రా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సందర్భంలోనూ ఇలాంటి రకమైన అనుభవమే ఎదుర్కోవాల్సి వచ్చింది... ఈ ఇద్దరూ బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఓటమికి కారణమైన విషయం తెలిసిందే.

ఈ విషయంపై భారత తాత్కాలిక కెప్టెన్ అజింకా రహానే అంపైర్లకు ఫిర్యాదు చేశాడు.

సిడ్నీలో క్రికెట్ గ్రౌండ్‌లో మద్యం సేవించే సదుపాయం ఉంటుంది.  దాంతో మద్యం మత్తులో చేసిన ఈ వ్యాఖ్యలపై అంపైర్లు, సెక్యురిటీ అధికారులతో చర్చించారు.

బీసీసీఐ, ఐసీసీకి ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందిస్తామని తెలిపారు అధికారులు.

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించి, దురుసుగా ప్రవర్తించే ఆస్ట్రేలియా ప్రజలకు వారి స్టైల్‌లోనే సమాధానం చెప్పే విరాట్ కోహ్లీ లేకపోవడం వల్లే టీమిండియాకి ఈ పరిస్థితి ఎదురైందని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్.

భారత పర్యటనలో స్టీవ్ స్మిత్‌పై ‘ఛీటర్’ అంటూ ప్రేక్షకులు అరుస్తూ అవమానిస్తూ... అతనికి సపోర్టుగా నిలిచాడు విరాట్ కోహ్లీ.

మనదేశానికి వచ్చిన క్రికెటర్లను గౌరవించాలంటూ ప్రేక్షకులకు చెప్పాడు. అంతేకాకుండా ఐపీఎల్ సమయంలో విదేశీ క్రికెటర్లను ఎంతో గౌరవించి, వారికి సకల సౌకర్యాలు అందచేసింది బీసీసీఐ.

అయితే ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రేక్షకులు కూడా ఇలా అవమానిస్తుండడంతో టీమిండియా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అగ్రెసివ్ కెప్టెన్‌గా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ ఉండి ఉంటే, టీమిండియా పరిస్థితి ఇలా ఉండేది కాదని... భారత జట్టు ‘కింగ్’ కోహ్లీని బాగా మిస్ అవుతోందని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్..

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?