- Home
- Sports
- Cricket
- షమీ బౌలింగ్‌లో ఆడేందుకు రోహిత్, కోహ్లీ కూడా ఇష్టపడరు! అతనో టార్చర్... దినేశ్ కార్తీక్ షాకింగ్ కామెంట్స్...
షమీ బౌలింగ్‌లో ఆడేందుకు రోహిత్, కోహ్లీ కూడా ఇష్టపడరు! అతనో టార్చర్... దినేశ్ కార్తీక్ షాకింగ్ కామెంట్స్...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత మహ్మద్ షమీని టీ20 ఫార్మాట్‌కి దూరం పెట్టింది టీమిండియా. అయితే జస్ప్రిత్ బుమ్రా గాయపడడంతో చివరికి మళ్లీ అతనే దిక్కయ్యాడు టీమిండియాకి. నాగ్‌పూర్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్‌ని 1 పరుగుకే క్లీన్ బౌల్డ్ చేసిన షమీ, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశాడు...

David Warner
మంచి ఫామ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. షమీ దెబ్బకు వికెట్ గాల్లోకి ఎగిరి, ఆమడ దూరంలో పడింది.. స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించిన నాగ్‌పూర్ టెస్టులో షమీ తన మార్కు చూపించాడు..
Mohammed Shami-Dinesh Karthik
‘మహ్మద్ షమీని నేను ‘టార్చర్ షమీ’ అని పిలుస్తాను. ఎందుకంటే నా పూర్తి కెరీర్‌లో నన్ను నెట్స్‌లో బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్ అతనే. ఐపీఎల్‌లో కూడా నన్ను షమీ, రెండు మూడు సార్లు అవుట్ చేశాడు...
నెట్స్‌లో మహ్మద్ షమీని ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. నేను, నాకు మాత్రమే ఇలా ఉంటుందేమో అనుకునేవాడిని. అయితే నేను రోహిత్, కోహ్లీ, ధోనీ, మిగిలిన లెజెండరీ బ్యాటర్లు కూడా ఈ విషయం అడిగాను. వాళ్లు కూడా షమీ బౌలింగ్‌లో ఆడడాన్ని అస్సలు ఇష్టపడమని చెప్పారు...
మహ్మద్ షమీ ఎందుకు ఇంత స్పెషల్ ఏంటంటే.. సీమ్ పొజిషన్. అతని లెంగ్త్ 6-8 మీటర్ల మార్కు దగ్గర ఉంటుంది. అది ఎలాంటి బ్యాటర్‌కి అయినా చాలా కష్టమైన లెంగ్త్... ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్..
Mohammed Shami
కపిల్ దేవ్, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు తీసుకున్న భారత పేసర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు మహ్మద్ షమీ...
బ్యాటుతోనూ 47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి అదరగొట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 17 నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.