MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • ఆ టైమ్‌లో కోపం, ఫ్రస్టేషన్, ఇరిటేషన్ అన్నీ ఒకేసారి వచ్చాయి... రమేశ్ పవార్‌తో గొడవపై మిథాలీ రాజ్...

ఆ టైమ్‌లో కోపం, ఫ్రస్టేషన్, ఇరిటేషన్ అన్నీ ఒకేసారి వచ్చాయి... రమేశ్ పవార్‌తో గొడవపై మిథాలీ రాజ్...

భారత మాజీ క్రికెటర్ మిథాలీరాజ్ కెరీర్‌లో చుట్టుముట్టిన వివాదాల్లో హెడ్ కోచ్‌ రమేశ్ పవార్‌తో గొడవల ఎపిసోడ్ చాలా పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. రిటైర్మెంట్ తర్వాత నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి మాట్లాడింది మిథాలీ రాజ్... 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 15 2022, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

2018 టీ20 వరల్డ్‌కప్ సమయంలో భారత జట్టుకి కోచ్‌గా వ్యవహారించాడు టీమిండియా మాజీ క్రికెటర్ రమేశ్ పవార్. ఆ సమయంలో భారత వన్డే కెప్టెన్ మిథాలీరాజ్‌కి భారత టీ20 జట్టులో చోటు కల్పించకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తనను కావాలనే టీ20 జట్టుకి దూరం చేస్తున్నారని హెడ్ కోచ్ రమేశ్ పవార్, సీఓఏ సభ్యురాలు డియానా ఎడ్లుల్జీలపై ఆరోపణలు చేసింది మిథాలీరాజ్. బ్యాటింగ్ ఆర్డర్‌లో తనని కింద ఆడాల్సిందిగా వాళ్లు ఒత్తిడి పెడుతున్నారని ఆరోపించింది మిథాలీ...
 

38

అయితే రమేశ్ పవార్, మిథాలీపై రివర్స్ ఆరోపణలు చేశాడు. ‘సీనియర్ ప్లేయర్‌గా జట్టు పరిస్థితిని అర్థం చేసుకుని ఆడాల్సిన మిథాలీరాజ్, బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి పంపితే, రిటైర్మెంట్ ప్రకటిస్తానని బెదిరించిందని’ ఆరోపించాడు రమేశ్ పవార్...

48

‘వివాదాల్లో ఇరుక్కున్నప్పుడు స్థిమితంగా, నిగ్రహం కోల్పోకుండా ఉండడం చాలా అవసరం. కొన్నిసార్లు మన ఫీలింగ్స్‌ని పక్కనబెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సైలెంట్‌గా ఉండడం అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. మన విషయంలో వివక్ష చూపించినప్పుడు దాన్ని బయటపెట్టడానికి చాలా ధైర్యం కావాలి...
 

58
Mithali Raj

Mithali Raj

ప్రతీ ఒక్కరికీ ఒకవైపు జరిగింది మాత్రమే తెలుస్తుంది. రెండో వైపు వారి వాదన వినడానికి ఇష్టపడరు కూడా. అందుకే నేను నా విషయంలో జరిగింది ప్రపంచానికి తెలియాలని అనుకున్నాను. నాకు క్రికెట్‌కి మించింది ఏదీ లేదు. క్రీజులోకి దిగిన ప్రతీ సారి నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నించా కానీ నా స్వంత రికార్డుల కోసం ఎప్పుడూ ఆడలేదు... నా పైన అలాంటి ఆరోపణలు చేసినప్పుడు కోపం, ప్రస్టేషన్, ఇరిటేషన్ అన్నీ వచ్చాయి. అన్నింటినీ కంట్రోల్ చేసుకుని, నా ఆటపైనే ఫోకస్ చేశా...’ అంటూ కామెంట్ చేసింది మిథాలీ రాజ్...

68

ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మిథాలీజ్ 50 పరుగులు చేసి ఆదుకుంది. అయితే మిథాలీ ఇన్నింగ్స్‌లో 25 డాట్ బాల్స్ ఉండడంతో ఆమె కేవలం తన వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతోందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు రమేశ్ పవార్...

78
Mithali Raj

Mithali Raj

ఈ సంఘటన తర్వాత రమేశ్ పవార్ కాంట్రాక్ట్ గడువు ముగిసి ఆ పదవి నుంచి తప్పుకోవడంతో డబ్ల్యూవీ రామన్, భారత మహిళా జట్టుకి కోచ్‌గా వ్యవహారించాడు. మళ్లీ మూడేళ్ల తర్వాత రమేశ్ పవార్‌ను తిరిగి మహిళా టీమ్ హెడ్ కోచ్‌గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

88

రమేశ్ పవార్‌తో వివాదం తర్వాత టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంది మిథాలీరాజ్. టీ20 కెప్టెన్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్, మిథాలీరాజ్ మధ్య కూడా విభేదాలున్నాయని తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. స్లోగా ఆడే మిథాలీ, టీ20ల్లో పనికి రాదని హర్మన్‌ప్రీత్ భావించేదని, ఇదే ఈ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణమని వార్తలు వచ్చాయి...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved