MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • బాక్సాఫీస్ డిజాస్టర్స్‌గా స్పోర్ట్స్ స్టార్స్ బయోపిక్స్‌... మొన్న సైనా, నిన్న 83, నేడు శభాష్ మిథూ...

బాక్సాఫీస్ డిజాస్టర్స్‌గా స్పోర్ట్స్ స్టార్స్ బయోపిక్స్‌... మొన్న సైనా, నిన్న 83, నేడు శభాష్ మిథూ...

బాలీవుడ్‌లో కొన్నాళ్లుగా బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ‘దంగల్’, ‘చక్‌ దే ఇండియా’, ‘బాగ్ మిల్కా బాగ్’, ‘ఎమ్మెస్ ధోనీ- ది అన్‌టోల్డ్ స్టోరీ’ వంటి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ వచ్చిన బయోపిక్స్, బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. దీంతో కొత్త కథలతో కష్టపడకుండా స్పోర్ట్స్ స్టార్ బయోపిక్‌లపైనే ఎక్కువ ఆసక్తి చూపించారు బాలీవుడ్ స్టార్స్. అయితే ఈ మధ్య విడుదలైన స్పోర్ట్స్ స్టార్స్ బయోపిక్స్ అన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని రాబడుతున్నాయి...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 17 2022, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శభాష్ మిథూ: భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన మూవీ ‘శభాష్ మిథూ’. టన్నుల కొద్దీ పరుగులు చేసి, కెప్టెన్‌గా విజయాలు అందించి... భారత్‌లో మహిళా క్రికెట్‌‌కి గుర్తింపు తెచ్చిన మిథాలీ రాజ్... తన కెరీర్‌లో ఎదుర్కొన్న అవమానాలను ఈ బయోపిక్‌లో చూపించే ప్రయత్నం చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image: Official film poster

Image: Official film poster

అయితే లీడ్ రోల్‌లో నటించిన తాప్సీ, మిథాలీగా మెప్పించలేకపోయింది. దీనికి తోడు కథ, కథనాలు, స్క్రీన్ ప్లే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్... ఏదీ ఇంప్రెస్ చేయలేకపోవడంతో మిథాలీ బయోపిక్‌... మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకుని అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ మూటకట్టుకుంది...

36

83: భారత క్రికెట్ దశను మార్చిన 1983 వన్డే వరల్డ్ కప్ విజయంపై రూపొందించిన బయోపిక్ మూవీ ‘83’. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో నటించాడు. తొలి రోజు నుంచే విమర్శకుల ప్రశంసలను అందుకున్న ‘83’ మూవీ, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం మాత్రం కురిపించలేకపోయింది. రూ.270 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘83’, ఎంతో కష్టపడి రూ.193 కోట్లు రాబట్టింది. అయినా బయ్యర్లకు రూ.77 కోట్ల నష్టం తప్పలేదు...

46

సైనా: భారత్‌లో బ్యాడ్మింటన్ ఆటకు క్రేజ్ తెచ్చిన ప్లేయర్ సైనా నెహ్వాల్. తిరుగులేని విజయాలు అందుకున్న సైనా జీవిత కథ ఆధారంగా, బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా ప్రధాన పాత్రలో ‘సైనా’ మూవీ రూపొందింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా, విడుదలైంది కూడా ఎవ్వరికీ తెలియకుండానే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది. మొత్తంగా రూ.26 కోట్లతో రూపొందిన ‘సైనా’, బాక్సాఫీస్ దగ్గర రూ.1.51 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది...

56

స్టోర్స్ స్టార్ల బయోపిక్స్ వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతుండడంతో ఇప్పుడు అందరి చూపు ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ వైపు మళ్లింది. భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి జీవితకథ ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ, నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. అయితే తాప్సీ తన నటనతో మిథాలీ బయోపిక్‌ని నాశనం చేసినట్టు, అనుష్క శర్మ, జులన్ కష్టాన్ని నవ్వుల పాలు చేయదు కదా.. అని భయపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

66

అదీకాకుండా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ బయోపిక్స్‌తో పాటు భారత టెన్నిస్ స్టార్ పీవీ సింధు బయోపిక్ రూపొందించే ఆలోచనల్లో ఉన్న డైరెక్టర్లు, నిర్మాతలు... ఈ బయోపిక్స్ రిజల్ట్స్ చూసి ఆలోచనలో పడ్డారట... 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved