MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • రిషబ్ పంత్‌ని అలా పిలుస్తారని తెలీదు! హీరో రామ్ గురించి మాట్లాడా!... మరో బాంబ్ పేల్చిన ఊర్వశి...

రిషబ్ పంత్‌ని అలా పిలుస్తారని తెలీదు! హీరో రామ్ గురించి మాట్లాడా!... మరో బాంబ్ పేల్చిన ఊర్వశి...

వార్తల్లో నిలిస్తేనే,బాలీవుడ్‌లోక్రేజూ, పాపులారిటీతో పాటు ఆఫర్స్ కూడా వచ్చేది. ఆ విషయం ఊర్వశి రౌతెల్లాకి బాగాతెలుసు. క్రికెటర్ రిషబ్ పంత్‌తో ప్రేమాయణం నడిపిస్తున్నట్టుగా వార్తల్లో నిలిచిన ఊర్వశి రౌతెల్లా, ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి ఈ యంగ్ వికెట్ కీపర్‌ని తెగ ఆటపట్టిస్తోంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 03 2022, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఊర్వశి రౌతెల్లా, రిషబ్ పంత్ మధ్య ఏదో ఉందని, 2019లోనే వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమోకానీ ఈ బాలీవుడ్ బ్యూటీని సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడు రిషబ్ పంత్. ఇషా నేగీ అనే వేరే మోడల్‌తో ప్రేమలో ఉన్నట్టు తెలిపాడు... అందరూ మరిచిపోయిన ఈ విషయాన్ని మళ్లీ లేపింది ఊర్వశి...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

‘నా కోసం మిస్టర్ ఆర్‌పీ, వారణాసికి వచ్చాడు. నేను ఆ రోజంతా షూటింగ్ చేసి అలిసిపోయి, హోటల్ రూమ్‌కొచ్చి పడుకున్నా. మిస్టర్ ఆర్‌పీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. దాంతో అతను అలిగి వెళ్లిపోయాడు...’ అంటూ ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెల్లా...

38

ఈ సంఘటన తర్వాత రిషబ్ పంత్,‘నన్ను వదిలేయి అక్కో’ అనే లెవెల్లో రియాక్ట్ అవ్వడం, దానికి ఊర్వశి రౌతెల్లా... ‘బ్యాటు బాల్ ఆట చూసుకో తమ్ముడూ’ అంటూ సమాధానం ఇవ్వడంతో ఇన్‌స్టాలో ఓ ‘నిబ్బా నిబ్బీ’ స్టైల్ వార్ నడిచింది. ఈ ఇద్దరి పిల్లీ ఎలుక గొడవ... జనాలకు వినోదం పచ్చింది. 

48
Image credit: Wikimedia Commons

Image credit: Wikimedia Commons

రిషబ్ పంత్ అని నేరుగా పేరు చెప్పకపోయినా, ‘మిస్టర్ ఆర్‌పీ’ అని ప్రస్తావించడం... అంతకుముందే చాలా రోజుల పాటు ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడిచిందనే వార్తలు రావడంతో ఆ ‘ఆర్‌పీ’ ఎవరో అందరికీ ఇట్టే అర్థమైపోయింది... గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు రిషబ్ పంత్ కూడా అనవసరంగా రియాక్ట్ అయ్యి, ఆమె కామెంట్లు తన గురించేనని చెప్పకనే చెప్పేశాడు..

58

సంజూ శాంసన్‌కి టీమ్‌లో చోటు ఇవ్వకపోవడంతో రిషబ్ పంత్ పేలవ ఫామ్ గురించి సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తుండడంతో ఊర్వశి విషయం అందరూ మరిచిపోయారు. దీంతో మరోసారి ఈ తీగను లాగింది ఊర్శశి...

68

‘ఆర్‌పీ అంటే ఎవరో కాదు, నా సహనటుడు. అతని పేరు రామ్ పోతినేని. రిషబ్ పంత్‌ని ఆర్‌పీ అని పిలుస్తారని కూడా నాకు తెలీదు... నిజం! నమ్మండి. నేను ఆర్‌పీ అని చెప్పగానే జనాలు ఏదేదో ఊహించుకుని రకరకాల కథనాలు అల్లేశారు.. అందులో నా తప్పేం లేదు...’ అంటూ కామెంట్ చేసింది ఊర్వశి రౌతెల్లా...

78

‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న తర్వాత ‘రెడ్’, ‘ది వారియర్’ రూపంలో రెండు షాక్‌లు తిన్నాడు రామ్ పోతినేని. ‘రెడ్’ బాక్సాఫీస్ దగ్గర బాగానే వసూళ్లు రాబట్టినా ‘ది వారియర్’ డిజాస్టర్‌గా మిగిలింది. ప్రస్తుతం యాక్షన్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు రామ్ పోతినేని..

88

రామ్ - బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేస్తోంది ఊర్వశి రౌతెల్లా. దీంతో ఆ ఆర్‌పీ టాపిక్‌ని ఈ ఆర్‌పీపైకి నెట్టేసి చేతులు దులుపేసుకుంది ఊర్వశి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘బాస్ పార్టీ’ పాటలో కూడా కనిపించబోతోంది ఊర్వశి... 

About the Author

CR
Chinthakindhi Ramu
రిషబ్ పంత్

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved