టీమిండియా టెస్టుల్లో 4-0 తేడాతో వైట్‌వాష్ అవుతుంది... విరాట్ ఆడకబోతే... ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్!
ఆస్ట్రేలియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రికీ పాంటింగ్ తర్వాత ఆస్ట్రేలియాకి ఐదో ప్రపంచకప్ అందించిన కెప్టెన్ మైకేల్ క్లార్క్. 2015లో న్యూజిలాండ్‌పై వరల్డ్‌కప్ సాధించిన మైకేల్ క్లార్క్, ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా వ్యవహారిస్తున్నాడు. ఆస్ట్రేలియా, భారత్ సిరీస్ ఆరంభానికి ముందు ‘టీమిండియా వన్డే, టీ20ల్లో రాణించకపోతే టెస్టుల్లో 4-0 తేడాతో చిత్తుగా ఓడుతుందని’... వ్యాఖ్యలు చేశాడు మైకేల్ క్లార్క్.
ఆస్ట్రేలియా టూర్ ప్రారంభానికి ముందు గత పర్యటనలో ఆసీస్ గడ్డ మీద అదరగొట్టిన టీమిండియానే హాట్ ఫెవరెట్‌గా నిలిచింది...
అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి టెస్టు తర్వాత స్వదేశానికి వస్తుండడం, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ గాయాల కారణంగా టెస్టులకు దూరం కావడంతో టూర్ ప్రారంభానికి ముందే ఒత్తిడిలో వెళ్లింది టీమిండియా...
ఇద్దరు టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్, ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉన్న సీనియర్ పేసర్ లేకుండా టీమిండియా ఏ మాత్రం ప్రదర్శన ఇవ్వగలదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు... టెస్టు సిరీస్‌కి ముందు వన్డే, టీ20 సిరీస్‌ల్లో విరాట్ కోహ్లీ రాణించడాన్ని బట్టి టీమిండియా ఆటతీరు ఆధారపడి ఉంటుందని అన్నారు క్లార్క్.
‘విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండే వన్డే, టీ20 సిరీస్ భారత జట్టులో మనోధైర్యం నింపడానికి చాలా కీలకం. ఈ సిరీస్‌ల్లో విరాట్ కోహ్లీ భారత జట్టును ముందుండి నడిపిస్తే, టీమ్‌లో స్థైర్యం పెరుగుతుంది...
అంటే విరాట్ కోహ్లీ జట్టును వదిలి, స్వదేశానికి వెళ్లే ముందు కనీసం ఓ సెంచరీ అయినా చేయాలి. లేదంటే భారత జట్టు టెస్టు సిరీస్‌ను 4-0 తేడాతో ఓడిపోతుంది...
నవంబర్ 27 నుంచి మొదలయ్యే ఈ టూర్‌లో మొదట మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడబోతోంది టీమిండియా. డిసెంబర్ 17 నుంచి మొదలయ్యే మొదటి టెస్టు ముగిసిన తర్వాత పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశం వెళ్లనున్నాడు విరాట్ కోహ్లీ.
‘విరాట్ కోహ్లీ చాలా మంచి బ్యాట్స్‌మెన్ అండ్ కెప్టెన్. అతను జట్టులో ఉంటే మిగిలిన ఆటగాళ్లలో భరోసా నింపుతాడు. అతను స్వదేశం చేరిన తర్వాత ఆటగాళ్లు మరింత మెరుగ్గా రాణించడానికి ఇది ఉపయోగపడుతుంది...
ఒకవేళ విరాట్ కోహ్లీ వన్డేలు, టీ20ల్లో విఫలమైతే... ఆ ప్రభావం భారత జట్టుపై కచ్ఛితంగా పడుతుంది. అందుకే అలా జరగకుండా ఉండాలంటే విరాట్ కోహ్లీ సెంచరీ చేశాకే స్వదేశానికి పయనమవ్వాలి’ అని వివరించాడు క్లాక్.
మెరుపు వేగంతో యార్కర్లు వేసే బుమ్రాను ప్రశంసించిన క్లాక్... ఆస్ట్రేలియా టూర్‌లో రాణించాలంటే అతను ఆసీస్ బ్యాట్స్‌మెన్‌పై కోపాన్నంతా ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. వికెట్లు తీయడమే ముఖ్యం కాదని, బౌలింగ్ ఎలా వేయాలో కూడా తెలియడం చాలా ముఖ్యమన్నాడు క్లార్క్.