- Home
- Sports
- Cricket
- ఆ రోజు అక్క మాట విని ఉంటే అయిపోయేదిగా... దీపక్ చాహార్ సోదరి మాలతి పాత కామెంట్ వైరల్...
ఆ రోజు అక్క మాట విని ఉంటే అయిపోయేదిగా... దీపక్ చాహార్ సోదరి మాలతి పాత కామెంట్ వైరల్...
అప్పుడెప్పుడో ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడి, ఆరు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు దీపక్ చాహార్. రీఎంట్రీ ఇచ్చి, మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నాడని సంతోషించేలోపు మరోసారి గాయంతో టీ20 వరల్డ్ కప్ 2022కి దూరమయ్యాడు. రీఎంట్రీ తర్వాత పట్టుమని పది మ్యాచులు కూడా ఆడలేదు దీపక్ చాహార్...

Image credit: PTI
జస్ప్రిత్ బుమ్రా గాయంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరం కావడంతో అతని ప్లేస్‌లో దీపక్ చాహార్‌కి అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వినిపించాయి. బంతితో పవర్ ప్లేలో ఒకటిరెండు వికెట్లు తీయడమే కాకుండా లోయర్ ఆర్డర్‌లో బ్యాటుతో సిక్సర్లు బాదుతూ పరుగులు కూడా చేయగలగడం దీపక్ చాహార్‌లో ఉన్న ఎక్స్‌ట్రా ఎబిలిటీ...
అయితే ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడిన దీపక్ చాహార్ గాయం తిరగబెట్టడంతో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడలేదు. తాజాగా అతను టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి కూడా దూరమైనట్టు సమాచారం. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో స్టాండ్ బై ప్లేయర్‌గా ఆడిన దీపక్ చాహార్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి కూడా స్టాండ్ బై ప్లేయర్‌గానే ఎంపికయ్యాడు.
Image credit: Getty
అయితే అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని ప్లేస్‌లో మహ్మద్ సిరాజ్‌తో పాటు శార్దూల్ ఠాకూర్ కూడా ఆస్ట్రేలియాకి పయనమయ్యారు. వీరిలో ఆల్‌రౌండర్ అర్హతలు ఉన్న శార్దూల్ ఠాకూర్‌కి స్టాండ్ బై ప్లేయర్‌గా చోటు దక్కొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా బీసీసీఐ అధికారిక ప్రకటన చేయలేదు..
దీపక్ చాహార్ గాయంతో నాలుగు నెలల క్రితం అతని అక్క మాలతి చాహార్ చేసిన ఓ పాత కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2021లో తన గర్ల్‌ఫ్రెండ్ జయా భరద్వాజ్‌కి స్టేడియంలో ప్రపోజ్ చేసిన దీపక్ చాహార్, ఈ ఏడాది జూన్ 2న ఆమెలో ఆగ్రాలో ఘనంగా వివాహం చేసుకున్నాడు...
ఈ ఇద్దరూ హానీమూన్‌లో విహరించారు. ఈ సమయంలోనే దీపక్ చాహార్ అక్క మాలతి చాహార్, తమ్ముడికి ఓ సలహా ఇచ్చింది. ‘ఇప్పుడు ఈ పిల్ల మాదైపోయింది. మీ ఇద్దరికీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.. తమ్ముడు దీపక్ చాహార్ హానీమూన్‌లో నీ నడుము జాగ్రత్త. వరల్డ్ కప్ ముందుంది...’ అంటూ రాసుకొచ్చింది...
తాజా గాయంతో ఈ కామెంట్ ఇప్పుడు మళ్లీ బయటికి వచ్చి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది... దీపక్ చాహార్ అక్క చెప్పినట్టు విని, కాస్త ఆ నడుముకి కాస్త పని తక్కువ చెప్పి ఉంటే ఈపాటిక ఆస్ట్రేలియాలో ఉండేవాడని అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మాలతి చాహార్ మోడలింగ్‌లో బిజీగా ఉంటూ బాలీవుడ్‌లో సినిమాలు కూడా చేస్తోంది...