MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025: రోహిత్ శర్మ కోసం 50 కోట్లు.. లక్నో సూపర్ జెయింట్స్ ఏం చేస్తుందో తెలుసా?

IPL 2025: రోహిత్ శర్మ కోసం 50 కోట్లు.. లక్నో సూపర్ జెయింట్స్ ఏం చేస్తుందో తెలుసా?

IPL 2025-Rohit Sharma: రాబోయే ఐపీఎల్ 2025 లో రోహిత్ శర్మను ద‌క్కించుకోవ‌డం కోసం ఎల్ఎస్జీ రూ.50 కోట్లు ఖ‌ర్చుచేయ‌బోతుందనే వార్త‌లు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే  లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) యజమాని సంజీవ్ గోయెంకా స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 29 2024, 07:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

IPL 2025-Rohit Sharma: లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్జీ) భారత మాజీ ఫాస్ట్ బౌలింగ్ లెజెండ్ జహీర్ ఖాన్‌ను తమ జ‌ట్టు కొత్త మెంటార్‌గా నియమించినట్లు ఆ టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా తెలిపారు. ఈ నిర్ణ‌యం ఇప్పుడు రాబోయే ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం ల‌క్నో టీమ్ వ్యూహం, ఉన్నత స్థాయి ఆటగాళ్ల భవిష్యత్తు గురించి ఊహాగానాలను మ‌రింత పెంచింది. 

26

ఇదే స‌మ‌యంలో కేఎల్ రాహుల్ ను జ‌ట్టులో ఉంచుకుంటారా?  లేదా? జ‌ట్టులో ఉంటే ప్లేయ‌ర్ గా ఉంటాడా?  లేక కెప్టెన్ గా కొన‌సాగుతాడా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదే క్ర‌మంలో ల‌క్నో టీమ్ కు సంబంధించి మ‌రో వార్త సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేమిటంటే.. భార‌త ఛాంపియ‌న్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను ఎల్ఎస్జీ టీమ్ ద‌క్కించుకోవ‌డానికి ప్ర‌త్యేక వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంద‌నీ, రాబోయే మెగా వేలంలంలో రోహిత్ శ‌ర్మ‌ను దక్కించుకోవ‌డానికి ఏకంగా రూ.50 కోట్లను త‌న ప‌ర్సులో ఉంచుకోనుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 

36

ల‌క్నో జ‌ట్టు కేవ‌లం ఒక్క ప్లేయ‌ర్ కోసం ఏకంగా రూ.50 కోట్ల‌ను వేరుగా పెట్టార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ ముంబై జ‌ట్టులో ఉన్నాడు. అత‌ని కోసం చాలా ఫ్రాంఛైజీలు పోటీ ప‌డుతున్నాయి. అయితే, ముంబై టీమ్ రోహిత్ శ‌ర్మ‌ను ఇంకా వ‌దిలిపెట్ట‌లేదు. గ‌త సీజ‌న్ లో కెప్టెన్సీ నుంచి రోహిత్ శ‌ర్మ‌ను తొల‌గించిన ముంబై టీమ్ రోహిత్ ను రిటైన్ చేసుకుంటుందా? లేదా వ‌దులుకుంటుందా? అనే విష‌యంపై ఇంకా అధికారికంగా ధృవీక‌రించ‌లేదు. 

46

ల‌క్నో టీమ్ రోహిత్ శ‌ర్మ‌ను త‌మ జ‌ట్టు కెప్టెన్ గా చేయాల‌ని చూస్తోంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై ఆ టీమ్ య‌జ‌మాని సంజీవ్ గోయెంకా తాజాగా స్పందించారు. రోహిత్ శర్మను ద‌క్కించుకోవ‌డం కోసం ఎల్ఎస్జీ 50 కోట్ల రూపాయలను రిజర్వ్ చేసిందని వార్త‌ల‌పై ఆయ‌న స్పందిస్తూ పుకార్లుగా కొట్టిపారేశారు. సంజీవ్ గోయెంకా ఈ ఆలోచనను నిరాధారమైనదిగా, ఇది ఆచరణాత్మకం కాదని కొట్టిపారేశారు.

56
Rohit to Rishabh

Rohit to Rishabh

"రోహిత్ శర్మ వేలంలోకి ప్రవేశిస్తున్నాడో లేదో కూడా  తెలియ‌దు. మీకు తెలుసా? ఇదంతా అనవసర చ‌ర్చ‌.. ఇదంతా ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను విడుదల చేస్తుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రోహిత్ వేలానికి వచ్చినా.. మీ పర్సులో 50 శాతం ఒక్క ప్లేయ‌ర్ పై పెడితే మిగ‌తా ప్లేయ‌ర్ల‌ను ఎలా కొనుగోలు చేస్తారు?" అని గోయెంకా చిరు నవ్వుతో స్పందించారు.

 

66

అలాగే, "ప్రతి ఒక్కరూ బెస్ట్ కెప్టెన్, బెస్ట్ ప్లేయ‌ర్లు జ‌ట్టులో ఉండాల‌ని కోరుకుంటారు. అయితే, ఇది కోరుకోవడం గురించి కాదు. ఇది మీ ప‌ర్సులో ఎంత ఉంది? దానితో మీరు ఏం చేయ‌గ‌ల‌రు?  అనే దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది. ప్రతి ఫ్రాంచైజీకి అదే కోరిక ఉంటుంది" అని అన్నారు. రోహిత్ శర్మ లాంటి క్యాలిబర్ ఉన్న ఆటగాడిని కొనుగోలు చేయడం ఏ జట్టుకైనా అసెట్ అవుతుందని పేర్కొన్న ఆయ‌న ఇంత మొత్తం కేటాయించ‌డం సాధ్యం కాద‌ని సంజీవ్ గోయెంకా అన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
రోహిత్ శర్మ
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
జింబాబ్వేపై థండర్ విక్టరీ.. ఏం లాభం.! మూడో ప్లేస్‌లోనే మిగిలిపోయిన టీమిండియా
Recommended image2
30 బంతుల్లో ఊహకందని ఊచకోత.. కట్ చేస్తే.. కాటేరమ్మ కొడుకు ఖాతాలో చెత్త రికార్డు
Recommended image3
IND vs ZIM : హార్దిక్, అభిషేక్ మాస్ విధ్వంసం.. జింబాబ్వేపై టీమిండియా గెలుపు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved