- Home
- Sports
- Cricket
- కెన్యాతో ఓడినా మనోళ్లు తట్టుకుంటారు, కానీ పాకిస్తాన్‌తో ఓడితే... అనిల్ కుంబ్లే ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
కెన్యాతో ఓడినా మనోళ్లు తట్టుకుంటారు, కానీ పాకిస్తాన్‌తో ఓడితే... అనిల్ కుంబ్లే ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ, ఆసియా కప్ 2023 టోర్నీలకు కౌంట్‌డౌన్ మొదలైపోయింది. ఈ రెండు టోర్నీల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లకు ముందు టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..

2012 నుంచి ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. దీంతో ఆసియా కప్, ఐసీసీ టోర్నమెంట్లలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచులు చూసే అదృష్టం కలుగుతోంది.
1996, 1999, 2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఇండియా, పాకిస్తాన్‌ని చిత్తు చేసింది.. ఈ వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియా తరుపున అనిల్ కుంబ్లే అదరగొట్టాడు..
పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే అనిల్ కుంబ్లే అద్భుతమైన ప్రదర్శన ఇచ్చేవాడు. పాక్‌తో జరిగిన 15 టెస్టుల్లో 81 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే, 34 వన్డేల్లో 54 వికెట్లు తీశాడు. 1999 ఢిల్లీ టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి అనిల్ కుంబ్లే, వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది కూడా పాకిస్తాన్‌పైనే..
‘మేం క్రికెట్ ఆడే రోజుల్లో ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ రణరంగమే. ప్రతీ ప్లేయర్‌లోనూ ప్రెషర్ పెరిగిపోయింది, అంచనాలు ఆకాశాన్ని తాకేవి. కెన్యాతో అయినా ఓడిపోండి కానీ పాకిస్తాన్‌తో మాత్రం ఓడిపోవద్దని ఫ్యాన్స్ కోరుకునేవాళ్లు..
ప్లేయర్లు కూడా కేవలం ఓ గేమ్‌లా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ని చూసేవాళ్లు కాదు, అదో ఫైట్. అందుకే ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ చూస్తుంటే ఓ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలిగేది, ఆ ఎమోషన్స్ వేరే లెవెల్..
ఢిల్లీ టెస్టు ప్రారంభమైనప్పుడు నేను ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీస్తానని అనుకోలేదు. అది ఏ బౌలర్‌కైనా ఓ కల... నాకూ ఇప్పటికీ ఆ ఇన్నింగ్స్ ఓ కలలాగే అనిపిస్తూ ఉంటుంది... అయితే ఆ తర్వాతి టెస్టు మ్యాచ్, కోల్‌కత్తాలో జరిగింది...
ఆసియా టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాకిస్తాన్‌తోనే ఆడాం, ఆ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. క్రికెట్ గేమ్ అలాగే ఉంటుంది. ఎవరి అంచనాలకు అందదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే..
ప్లేయర్‌గా పాకిస్తాన్‌పై ఒక్క ఐసీసీ మ్యాచ్ కూడా ఓడిపోలేదు అనిల్ కుంబ్లే. అయితే హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే కోచింగ్‌లోని టీమిండియా, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాక్ చేతుల్లో చిత్తుగా ఓడి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది..