ముందు మీ పని చూసుకోండి : ఆస్ట్రేలియా క్రికెటర్లపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం
Sunil Gavaskar:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీద విమర్శలు చేస్తున్న ఆసీస్ మాజీ క్రికెటర్ల మీద టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు.

బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) కంటే ముందే యూఏఈలో నిర్వహించదలిచిన ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)తో పాటు దక్షిణాఫ్రికాలో తొలిసారి జరిపించబోతున్న క్రికెట్ సౌతాఫ్రికా లీగ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడాలని భావిస్తున్నారు. దీంతో పాటే తమ ప్రాధాన్యం ఐపీఎల్ అని చెప్పకనే చెబుతున్నారు.
కొద్దిరోజుల క్రితం ఆడమ్ గిల్‌క్రిస్ట్ సైతం ఐపీఎల్ ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్నదని వ్యాఖ్యానించాడు. ఈ లీగ్ లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న వేళ భారత మాజీ ఆటగాడు, దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందు మీ గురించి చూసుకోండని విమర్శలు గుప్పించాడు
సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ‘అందరూ ఐపీఎల్ మీదే పడుతున్నారు. ఐపీఎల్ వల్ల తమ క్రికెట్ షెడ్యూల్ కు అంతరాయం కలుగుతుందని అంటున్నారు. సౌతాఫ్రికా టీ20 లీగ్ తో పాటు యూఏఈ క్రికెట్ లీగ్ ల రాకతో ఈ విమర్శల వాన ఎక్కువైంది. దీనికంతటికి ఐపీఎల్ నే దోషిగా చేస్తున్నారు. ఇది చదవడానికి వింతగా ఉంది.
మమ్మల్ని విమర్శించే ముందు మీ గురించి చూసుకోండి. మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అంతేగా మేమేం చేయాలో చెప్పకండి..’ అని సూచించాడు.
అంతేగాక ఆస్ట్రేలియా కూడా బిగ్ బాష్ లీగ్ నిర్వహిస్తున్నది. కానీ ఆ జట్టుకు చెందిన ఆటగాళ్లు ఇప్పుడు సౌతాఫ్రికా, యూఏఈ లీగుల్లో ఆడేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఆసీస్ హైరానా పడుతున్నది. వాళ్ల లీగ్ ప్రమాదంలో పడుతున్న క్రమంలో ఇతర లీగుల మీద విమర్శలు చేయడం దారుణం.. అని సన్నీ తెలిపాడు.