- Home
- Sports
- Cricket
- జీవితం చాలా కష్టంగా ఉంది.. ఎవరూ పట్టించుకోవడం లేదు : స్టింగ్ ఆపరేషన్ తర్వాత మాజీ చీఫ్ సెలక్టర్ ఆవేదన
జీవితం చాలా కష్టంగా ఉంది.. ఎవరూ పట్టించుకోవడం లేదు : స్టింగ్ ఆపరేషన్ తర్వాత మాజీ చీఫ్ సెలక్టర్ ఆవేదన
Chetan Sharma: భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్, టీమిండియాకు గత మూడేండ్ల పాటు చీఫ్ సెలక్టర్ గా పనిచేసిన ఛేతన్ శర్మ తాజాగా సంచలన ట్వీట్ చేశాడు.

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, బీసీసీఐకి మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన సౌరవ్ గంగూలీ హయాంలో ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీకి చైర్మెన్ గా చక్రం తిప్పిన ఛేతన్ శర్మ.. కొద్దిరోజుల క్రితమే ఓ స్ట్రింగ్ ఆపరేషన్ లో దొరికి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
టీమిండియాలోని రహస్యాలు, గంగూలీ - కోహ్లీ మధ్య గొడవ, భారత క్రికెట్ జట్టులో ఆటగాళ్ల ఫిట్నెస్, భావి సారథి వంటి విషయాలపై ఛేతన్ శర్మ మాట్లాడిన మాటలు భారత క్రికెట్ లో సంచలనానికి దారి తీశాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జీ న్యూస్, వియాన్ లు సంయుక్తంగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఛేతన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కావడంతో బీసీసీఐ తక్షణమే ఉపశమన చర్యలకు దిగింది. ఛేతన్ ను పదవి నుంచి తప్పించకముందే అతడే స్వయంగా తన పోస్టుకు రాజీనామా చేశాడు. దీంతో బీసీసీఐ.. శివ సుందర్ దాస్ ను తాత్కాలిక చైర్మెన్ గా నియమించింది.
Image credit: Chetan Sharma/Instagram
అయితే ఇన్నాళ్లు స్టింగ్ ఆపరేషన్, అందులో తాను మాట్లాడిన మాటల గురించి సైలెంట్ గా ఉన్న ఛేతన్ శర్మ తాజాగా స్పందించాడు. బుధవారం అర్థరాత్రి ట్విటర్ వేదికగా ఛేతన్ తన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇప్పటివరకూ జీవితం చాలా కష్టంగా ఉంది. మీ దగ్గరి బంధువుల నుంచి గానీ ప్రియమైన వారి నుంచి గానీ ఎటువంటి మద్దతు లేదు. మాతా రాణి నన్ను (దేవుళ్లను ప్రార్థిస్తూ) ఆశీర్వదిస్తుందని అనుకుంటున్నా..’అని రాసుకొచ్చాడు.
స్టింగ్ ఆపరేషన్ వీడియోలో ఛేతన్ చెప్పిన విషయాలు మామూలేవేం కాదు. కోహ్లీ - గంగూలీ విబేధాలతో పాటు కొంతమంది భారత ఆటగాళ్లు ఫిట్నెస్ కోసం డ్రగ్స్ తీసుకుంటానని చెప్పడం సంచలనానికి దారి తీసింది. అయితే ఈ నష్టాన్ని పూడ్చేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసింది.
సరిగ్గా ఛేతన్ శర్మ వీడియో వైరల్ అయిన మరుసటి రోజే జియో, స్టార్ లలో ఐపీఎల్ - 2023 షెడ్యూల్ ప్రకటించి చర్చనంతా ఛేతన్ చుట్టూ కాకుండా ఐపీఎల్ వైపునకు మళ్లించింది. దీంతో ఛేతన్ వీడియో వ్యవహారం మరుగునపడిపోయింది.