- Home
- Sports
- Cricket
- మళ్లీ బ్యాటు పట్టబోతున్న సౌరవ్ గంగూలీ... లెజెండ్స్ లీగ్ క్రికెట్‌కి ప్రాక్టీస్ మొదలెట్టిన దాదా...
మళ్లీ బ్యాటు పట్టబోతున్న సౌరవ్ గంగూలీ... లెజెండ్స్ లీగ్ క్రికెట్‌కి ప్రాక్టీస్ మొదలెట్టిన దాదా...
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రస్తుత ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ... తిరిగి బ్యాటు పట్టబోతున్నాడు. క్రికెట్‌కి రాజీనామా ఇచ్చిన తర్వాత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కి సేవలు అందించిన దాదా, బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఐసీసీ ఛైర్మెన్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి...

లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్‌సీ) రెండో సీజన్‌ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ టోర్నీలో ఓ స్పెషల్ ఛారిటీ మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ ఆడబోతున్నాడు...
1996లో లార్డ్స్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సౌరవ్ గంగూలీ, ఆ మ్యాచ్‌లో 131 పరుగులు చేసి... లార్డ్స్‌లో ఎంట్రీ ఇచ్చి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆ తర్వాత కెప్టెన్‌గా 2002 నాట్‌వెస్ట్ ట్రోఫీతో పాటు 2003 వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టుని ఫైనల్ చేర్చాడు...
Sourav Ganguly
భారత జట్టు తరుపున 113 వన్డేలు, 311 వన్డేలు ఆడిన సౌరవ్ గంగూలీ, రెండో ఫార్మాట్లలో కలిపి దాదాపు 20 వేల దాకా పరుగులు చేశాడు. సౌరవ్ గంగూలీ కొట్టే భారీ సిక్సర్లకు అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది..
‘అజాదీకా మహోత్సవ్ కోసం ఫండ్స్ వసూలు చేసేందుకు ఓ ఛారిటీ మ్యాచ్ ఆడాలని నిర్ణయం తీసుకున్నాం. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావడంమే కావడంతో మహిళా సంక్షేమం కోసం లెజెండ్స్ లీగ్ క్రికెట్ ద్వారా నిధులు వసూలు చేయబోతున్నాం...’ అంటూ ఇన్‌స్టాలో జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్న వీడియో పోస్టు చేశాడు సౌరవ్ గంగూలీ...
Dale Steyn-AB de Villiers
ఈసారి లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో డేల్ స్టెయిన్, ఇయాన్ మోర్గాన్, రాస్ టేలర్, లాన్స్ క్లుసేనర్, హర్భజన్ సింగ్, జాక్వస్ కలీస్, ఇర్పాన్ పఠాన్ వంటి మాజీ స్టార్ క్రికెటర్లు పాల్గొనబోతున్నారు...
World Giants
భారత సంస్కృతిక శాఖ నుంచి భారత క్రికెట్ బోర్డుకి ఈ మ్యాచ్‌కి సంబంధించిన రిక్వెస్ట్ వచ్చిందని ... ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్’ క్యాంపెయిన్‌లో భాగంగా భారత స్టార్ ప్లేయర్లతో కూడిన జట్టుకీ, మిగిలిన దేశాల ప్లేయర్లతో నిండిన ‘రెస్ట్ ఆఫ్ ఇండియా’ టీమ్‌కి ఆగస్టు 22న మ్యాచ్ నిర్వహించాలనే ప్రతిపాదన, బీసీసీఐ అధికారులకు అందినట్టు వార్తలు వచ్చాయి...
Asia Lions
అయితే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో ఈ మ్యాచ్ నిర్వహణ అంత తేలికయ్యే పని కాదని తేల్చేసిన భారత క్రికెట్ బోర్డు, మాజీ క్రికెటర్లతో కలిసి లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఛారిటీ మ్యాచ్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది...