KXIP vs RCB: పంజాబ్‌తో బెంగళూరు ఢీ... హెడ్ టు హెడ్ లెక్కలు...
PL 2020: ఐపీఎల్ 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతోంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిపోగా... సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుత విజయం సాధించిన బెంగళూరు విజయోత్సహాంతో బరిలో దిగుతోంది. ఈ రెండు జట్ల మధ్య రికార్డులు ఇలా ఉన్నాయి.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటిదాకా 24 సార్లు తలబడ్డాయి.
రెండు జట్లు కూడా చెరో 12 మ్యాచుల్లో విజయం సాధించాయి.
పంజాబ్‌పై రాయల్ ఛాలెంజర్స్ చేసిన అత్యధిక స్కోరు 226 పరుగులు.
బెంగళూరుపై కింగ్స్ ఎలెవన్ చేసిన అత్యధిక స్కోరు 232 పరుగులు.
పంజాబ్‌పై బెంగళూరు జట్టు అత్యల్పంగా 84 పరుగులకే చాప చుట్టేసింది.
రాయల్ ఛాలెంజర్స్‌పై పంజాబ్ జట్టు అత్యల్పంగా 88 పరుగులు చేసింది.
గత 10 మ్యాచుల్లో పంజాబ్ జట్టు కేవలం మూడు మ్యాచుల్లో విజయం సాధించగా, బెంగళూరు ఏడు సార్లు గెలుపొందింది.
గత రెండు సీజన్లలో జరిగిన నాలుగు మ్యాచుల్లోనే పంజాబ్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుదే విజయం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటిదాకా మూడు సీజన్లలో ఫైనల్ చేరినా, ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇప్పటిదాకా కేవలం ఒక్కసారి మాత్రమే (2014 సీజన్‌లో) ఫైనల్ చేరింది. ఇరుజట్లు మొదటి టైటిల్ గెలవడానికి పట్టుదలగా ఉన్నాయి.