- Home
- Sports
- Cricket
- పాండ్యా బ్రదర్స్ ఫ్యామిలీలోకి మరో బుల్లి పాండా... తండ్రైన భారత క్రికెటర్ కృనాల్ పాండ్యా...
పాండ్యా బ్రదర్స్ ఫ్యామిలీలోకి మరో బుల్లి పాండా... తండ్రైన భారత క్రికెటర్ కృనాల్ పాండ్యా...
భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా తండ్రి అయ్యాడు. ఆయన భార్య పంకూరి శర్మ, ఆదివారం జూలై 24న ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన కొడుక్కి ‘కవీర్’ అని నామకరణం కూడా చేసేశాడు కృనాల్ పాండ్యా. కృనాల్ తమ్ముడు హార్ధిక్ పాండ్యా రెండేళ్ల క్రితమే తండ్రి అయిన విషయం తెలిసిందే...

హార్ధిక్ పాండ్యా కొడుకు అగస్త్యతో కలిసి ఆడుకునే కృనాల్ పాండ్యా, 2017 డిసెంబర్ 27న పంకూరి శర్మను వివాహం చేసుకున్నాడు. 2018లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన కృనాల్ పాండ్యా, జట్టులో స్థిరమైన చోటు దక్కించుకోలేకపోతున్నాడు...
ఐపీఎల్ 2017, 2019, 2020 సీజన్లలో టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యులుగా ఉన్న పాండ్యా బ్రదర్స్‌ని ఈసారి ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు. తమ్ముడు హార్ధిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా మారగా అన్న కృనాల్ పాండ్యా, 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడాడు...
టీమిండియా తరుపున 19 టీ20 మ్యాచులు ఆడిన కృనాల్ పాండ్యా 24.8 సగటుతో 124 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 15 వికెట్లు పడగొట్టాడు. 5 వన్డేలు ఆడి ఓ హాఫ్ సెంచరీతో 130 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 2 వికెట్లు తీశాడు...
2021లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆరంగ్రేటం చేసిన కృనాల్ పాండ్యా, తన తొలి వన్డేలో 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఆరంగ్రేటం మ్యాచ్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ 2021 సమయంలో దీపక్ హుడాతో గొడవపడిన కృనాల్ పాండ్యా, శ్రీలంక పర్యటనలో కరోనా పాజిటివ్‌గా తేలాడు. కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన కారణంగా 8 మంది ప్లేయర్లు దూరం కావడంతో రిజర్వు బెంచ్ ప్లేయర్లతో టీ20 సిరీస్ ఆడి 2-1 తేడాతో ఓడింది టీమిండియా...
ఈ సంఘటన తర్వాత కృనాల్ పాండ్యాకి భారత జట్టులో చోటు దూరమైంది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.8 కోట్ల 25 లక్షల భారీ మొత్తానికి కృనాల్ పాండ్యాని కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్... 2022 సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌ల్లో 183 పరుగులు చేసిన కృనాల్, 10 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు...