MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • శ్రీలంకతో టీ20 సిరీస్‌కి దూరంగా కెఎల్ రాహుల్, కోహ్లీ, రోహిత్... రెస్ట్ పేరుతో సీనియర్లపై వేటు!...

శ్రీలంకతో టీ20 సిరీస్‌కి దూరంగా కెఎల్ రాహుల్, కోహ్లీ, రోహిత్... రెస్ట్ పేరుతో సీనియర్లపై వేటు!...

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్... టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ, హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకున్నాక వెలుగులోకి వచ్చిన విధానం. ఒక్క సిరీస్ ఆడిన తర్వాత సీనియర్ ప్లేయర్లకు ఆ తర్వాతి సిరీస్ నుంచి రెస్ట్ కల్పించడమే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చిన రోహిత్ అండ్ రాహుల్... తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 25 2022, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌కి దూరంగా ఉన్న రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్‌ టూర్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. కివీస్ సిరీస్‌లో ఆడిన సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, బంగ్లాదేశ్ టూర్‌కి దూరంగా ఉన్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇలా అనధికారికంగా రొటేషన్ పద్ధతి ఫాలో అవుతున్న టీమిండియా మేనేజ్‌మెంట్, టీమ్ కాంబినేషన్‌ని రకరకాలుగా మారుస్తూనే ఉంది. బంగ్లాదేశ్‌లో వన్డే సిరీస్ ఓడిన తర్వాత ఈ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు చేశారు సీనియర్లు...

38

ఐపీఎల్ ఆడినప్పుడు అలిసిపోని క్రికెటర్లు, టీమిండియా ఆడినప్పుడు మాత్రం ఎందుకు అలిసిపోతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెస్ట్ కావాలని కోరుకుంటే ఐపీఎల్ సమయంలో విశ్రాంతి తీసుకోవాలని, టీమిండియాకి ఆడుతున్నప్పుడు ప్రతీ మ్యాచ్‌కి అందుబాటులో ఉండాలని భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు..

48

అయితే టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం దీన్ని వదిలిపెట్టేలా కనిపించడం లేదు. బంగ్లాదేశ్ టూర్‌ని ముగించుకున్న భారత జట్టు, వచ్చే ఏడాది జనవరి 3 నుంచి శ్రీలంకతో స్వదేశంలో టీ20 సిరీస్ ఆడనుంది.. ఈ సిరీస్ నుంచి సీనియర్లకు రెస్ట్ ఇవ్వాలని టీమిండియా డిసైడ్ అయినట్టు సమాచారం...

58

బంగ్లాదేశ్‌ టూర్‌లో గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ, పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. అయితే రోహిత్‌ని టీ20లకు దూరంగా పెట్టడమే బెటర్ అని నిర్ణయం తీసుకున్న బీసీసీఐ... టీమిండియా కెప్టెన్‌తో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా పక్కనబెట్టబోతున్నట్టు సమాచారం..
 

68

అలాగే కెఎల్ రాహుల్ కూడా శ్రీలంకతో టీ20 సిరీస్‌కి దూరంగా ఉండబోతున్నాడు. కొన్నాళ్లుగా బాలీవుడ్ బ్యూటీ అథియా శెట్టితో ప్రేమాయణం నడిపిస్తున్న కెఎల్ రాహుల్, వచ్చే ఏడాది ఆరంభంలో ఆమెను వివాహం చేసుకోబోతున్నాడు...

78
Image credit: KL Rahul/Facebook

Image credit: KL Rahul/Facebook

ఈ పెళ్లి కోసం కొన్నాళ్లు బ్రేక్ కావాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ని కోరాడట కెఎల్ రాహుల్. ఈ ఏడాది టీ20ల్లో అట్టర్‌ఫ్లాప్ అయిన రాహుల్‌కి లీవ్ మంజూరు చేసిన బీసీసీఐ, లంకతో టీ20 సిరీస్‌కి హార్ధిక్ పాండ్యాని కెప్టెన్‌గా ఎంచుకున్నట్టు వార్తలు వస్తున్నాయి...

88

శ్రీలంకతో మూడు మ్యాచుల టీ20 సిరీస్, మూడు వన్డేల సిరీస్ ఆడిన తర్వాత న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడుతుంది టీమిండియా. టీ20 సిరీస్‌కి దూరంగా ఉండే సీనియర్లు, వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ 2023 ఉన్న నేపథ్యంలో వన్డే సిరీస్‌లో పాల్గొంటారని టాక్.. ఈ సిరీస్‌లకు త్వరలో టీమ్‌ని ప్రకటించనుంది బీసీసీఐ...

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved