- Home
- Sports
- Cricket
- కెఎల్ రాహుల్ మరో రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయితే కష్టమే... ప్రత్యామ్నాయం చూసుకుంటారంటూ...
కెఎల్ రాహుల్ మరో రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయితే కష్టమే... ప్రత్యామ్నాయం చూసుకుంటారంటూ...
సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, ఈ ఏడాది మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడింది ఆసియా కప్ 2022 టోర్నీలోనే. సౌతాఫ్రికా టూర్ తర్వాత లంక, వెస్టిండీస్ టూర్లకు దూరంగా ఉన్న కెఎల్ రాహుల్, గాయం కారణంగా స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి కూడా దూరమయ్యాడు...

Suryakumar Yadav KL Rahul
ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి కెప్టెన్‌గా 616 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, అదే ఫామ్‌ని అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగించలేకపోయాడు. గాయంతో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి దూరమైన రాహుల్, ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు దూరమయ్యాడు...
KL Rahul
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సమయానికి కెఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకున్నా... కరోనా వచ్చి అతన్ని ఆడకుండా చేసింది. జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో పాల్గొన్న కెఎల్ రాహుల్, ఆసియా కప్ 2022 టోర్నీలో పాక్‌తో మ్యాచ్‌లో తొలిసారి ఈ ఏడాది టీ20 మ్యాచ్ ఆడాడు...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్ క్లీన్ బౌల్డ్ అయిన కెఎల్ రాహుల్, ఆసియా కప్ 2022 టోర్నీలోనూ అదే స్టైల్‌లో మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. హంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో 39 బంతులు ఆడి 2 సిక్సర్లతో 36 పరుగులు చేసి నిరాశపరిచాడు...
KL Rahul
‘టీమిండియాలో ఇప్పుడు కాంపిటీషన్ తీవ్రంగా పెరిగిపోయింది. జింబాబ్వే పర్యటనలో, అంతకుముందు వెస్టిండీస్ పర్యటనలో శుబ్‌మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మెప్పించాడు... కాబట్టి ఏ ప్లేయర్ అయినా వరుసగా ఫెయిల్ అవుతూ ఉంటే అతను ఫామ్‌లోకి వచ్చేదాకా వెయిట్ చేసే పరిస్థితి లేదు...
టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నీలకు పెద్దగా సమయం కూడా లేదు. ఇవన్నీ విషయాలు కెఎల్ రాహుల్ దృష్టిలో పెట్టుకోవాలి. అతనికి రెండు, మూడు మ్యాచుల సమయం మాత్రమే ఉంది. ఆ మ్యాచుల్లో కూడా అతను విఫలమైతే... సెలక్టర్లు, ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తారు...
Image credit: PTI
రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా... ఇలా ఓపెనింగ్ స్లాట్ విషయంలో టీమిండియా ప్రయోగాలు చేసింది ఇందుకే. వీరితో పాటు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్ కూడా పోటీలో ఉన్నారు. కాబట్టి కెఎల్ రాహుల్ ఎంత త్వరగా ఫామ్‌లోకి వస్తే అంత బెటర్...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్..