నెక్ట్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై సెంచరీ చేయాలి రా... కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలపై పేలుతున్న మీమ్స్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా బౌలింగ్ విభాగంపై పెద్దగా అంచనాలు లేవు. భువనేశ్వర్ కుమార్ సరైన ఫామ్‌లో లేడు, షమీ ఈ ఏడాది ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. అర్ష్‌దీప్‌కి పెద్దగా అనుభవం లేదు. అయితే బ్యాటింగ్ విభాగంపై మాత్రం భారీ అంచనాలున్నాయి...
కెఎల్ రాహుల్... ఐపీఎల్ 2022 సీజన్‌లో 600+ పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసి బ్యాటర్‌గా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ పొజిషన్ కోసం పోటీపడుతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా (పాక్ మ్యాచ్‌కి ముందు వరకూ) టాప్‌లో ఉన్నాడు...
Image credit: PTI
స్వయంగా రోహిత్ శర్మనే వాళ్ల బౌలింగ్‌కీ, మా బ్యాటింగ్‌కీ మధ్య అసలైన ఫైట్ ఉంటుందని వ్యాఖ్యానించాడు. అయితే ఎప్పటిలాగే భారీ అంచనాలు పెట్టుకున్న బ్యాటర్లు, కీలక మ్యాచులో చేతులు ఎత్తేశారు. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరి... టీమిండియాని కష్టాల్లో పడేశారు...
Image credit: PTI
2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ కాగా, కెఎల్ రాహుల్ 3 పరుగులు చేసి షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. ఈ సారి కెఎల్ రాహుల్‌ని నసీం షా అవుట్ చేయగా రోహిత్ శర్మ, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
గత ఏడాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి టీమిండియా ఓ బాధ్యతాయుత స్కోరు చేయడానికి కారణమైన విరాట్ కోహ్లీయే, ఈసారి కూడా వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత జట్టును గెలిపించి, పరువు కాపాడాడు. దీంతో కీలక మ్యాచ్‌లో ఫెయిల్ అయిన కెఎల్ రాహుల్, రోహిత్ శర్మపై మరోసారి విమర్శల వర్షం కురుస్తోంది...
Image credit: Getty
ఐపీఎల్ 2022 తర్వాత రెండు నెలల గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్... ఆసియా కప్‌లో ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీసుల్లో ఆకట్టుకున్న కెఎల్ రాహుల్.. టీ20 వరల్డ్ కప్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...
గత ఏడాది పాకిస్తాన్‌తో, న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయిన కెఎల్ రాహుల్... ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా హాఫ్ సెంచరీలు చేశాడు. ఇప్పుడు పాక్‌తో మ్యాచ్‌లో ప్లాప్ అయిన కెఎల్ రాహుల్, నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో సెంచరీ చేస్తాడని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...
అలాగే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ‘వాహ్ వా...’ అనిపించే రేంజ్‌లో ఒక్క కెప్టెన్సీ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు రోహిత్ శర్మ. పాక్‌తో జరిగిన మ్యాచ్, టీమిండియా గెలవడం అవసరం మాత్రమే కాదు, పరువు సమస్య కూడా... ఆ విషయం కూడా తెలిసి కూడా తీవ్రమైన ఒత్తిడికి గురై వికెట్ పారేసుకున్నాడు రోహిత్ శర్మ..
Rohit Sharma and KL Rahul
రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకోబోతున్నాడు వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్. కెప్టెన్‌గా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నా బ్యాటర్‌గా నిలకడైన పర్ఫామెన్స్ ఇస్తున్న కెఎల్ రాహుల్‌కే టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు...
రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ మ్యాచ్ విన్నర్లే. బ్యాటింగ్ టెక్నిక్ విషయంలో ఈ ఇద్దరూ టాప్ క్లాస్ బ్యాటర్లే. అయితే కీలక మ్యాచుల్లో, ఐసీసీ టోర్నీల్లో ఒత్తిడిని అధిగమించి పరుగులు చేయడంలో ఈ ఇద్దరూ అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. ఇదే విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లను వేరు చేస్తోందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...