- Home
- Sports
- Cricket
- ఇంకా గాయం నుంచి కోలుకోని కెఎల్ రాహుల్... ఇంగ్లాండ్ టూర్‌కి దూరమై, జర్మనీకి స్టార్ బ్యాటర్...
ఇంకా గాయం నుంచి కోలుకోని కెఎల్ రాహుల్... ఇంగ్లాండ్ టూర్‌కి దూరమై, జర్మనీకి స్టార్ బ్యాటర్...
ఇంగ్లాండ్ టూర్‌కి ముందు టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్, సూపర్ ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్... గాయం నుంచి కోలుకకపోవడంతో ఇంగ్లాండ్ టూర్‌కి కూడా దూరం కానున్నాడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు గాయపడిన విషయం తెలిసిందే...

సౌతాఫ్రికాతో సిరీస్ ఆరంభానికి ముందు గాయం కారణంగా కెఎల్ రాహల్ తప్పుకోవడంతో రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది భారత క్రికెట్ బోర్డు. అయితే రాహుల్ ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఇంగ్లాండ్ పర్యటనకు దూరం కానున్నాడు...
జూలై 1 నుంచి జరగాల్సిన ఐదో టెస్టుకి ఎంపికైన జట్లు ప్లేయర్లలో మెజారిటీ సభ్యులు ఇప్పటికే ఇంగ్లాండ్‌కి బయలుదేరి వెళ్లారు. భారత మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, ఛతేశ్వర్ పూజారా, నవ్‌దీప్ సైనీ, రవీంద్ర జడేజా, శుబ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, కెఎస్ భరత్, తదితరులు... ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కారు...
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్రస్తుతం సౌతాఫ్రికా సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్, హెడ్ కోచ్ రవిశాస్త్రి... మిగిలిన ప్లేయర్లు, టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ బయలుదేరతారు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నోసూపర్ జెయింట్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, 15 మ్యాచుల్లో 51.33 సగటుతో 616 పరుగులు చేశాడు. వరుసగా మూడో సీజన్‌లో 600+ పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
గాయపడిన తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో వైద్య శిక్షణ తీసుకున్న కెఎల్ రాహుల్, ట్రీట్‌మెంట్ కోసం జర్మనీ బయలుదేర వెళ్లబోతున్నాడు. టెస్టు మ్యాచ్‌కి అందుబాటులో లేకపోయినా వన్డే, టీ20 సిరీస్ సమయానికి కెఎల్ రాహుల్ అందుబాటులోకి వస్తాడని భావిస్తోంది భారత జట్టు...
‘కెఎల్ రాహుల్‌కి గజ్జల్లో అయిన గాయం ఇంకా తగ్గలేదు. అందుకే ముంబై క్యాంపులో అతను చేరలేదు. కెఎల్ రాహుల్ ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లడం లేదు. అతను కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుంది.జర్మనీలో ట్రీట్‌మెంట్ జరిగిన తర్వాత రాహుల్ ఫిట్‌నెస్‌పై ఓ అవగాహన వస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా...
‘ఇంతకుముందు 17 మంది సభ్యులను ఎంపిక చేశాం. ఇప్పుడు అందులో ఒకరు తప్పుకోవడంతో 16 మంది అందుబాటులో ఉంటారు. శుబ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడు. అవసరమైతే ఛతేశ్వర్ పూజారా, హనుమ విహారి కూడా ఓపెనింగ్ చేయగలరు...’ అంటూ కామెంట్ చేశాడు ఓ బీసీసీఐ అధికారి...
ఇంగ్లాండ్ టూర్ 2021లో తొలి టెస్టు ఆరంభానికి ముందు మయాంక్ అగర్వాల్ గాయపడడంతో అనుకోకుండా టెస్టు టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు కెఎల్ రాహుల్. ఆ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టి ఓపెనర్‌గా ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. కెఎల్ రాహుల్ కారణంగా తుది జట్టులోకి రాలేకపోయిన మయాంక్ అగర్వాల్‌కి ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకి ఎంపిక చేసిన జట్టులో చోటు కూడా దక్కకపోవడం విశేషం...