- Home
- Sports
- Cricket
- అతన్ని మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తే సమస్యలన్నీ తీరుతాయి, రిషబ్ పంత్‌తో పాటు... విండీస్‌తో సిరీస్‌కి ముందు..
అతన్ని మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తే సమస్యలన్నీ తీరుతాయి, రిషబ్ పంత్‌తో పాటు... విండీస్‌తో సిరీస్‌కి ముందు..
టీమిండియాని ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న సమస్య మిడిల్ ఆర్డర్ వైఫల్యం. 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలోనూ, 2021 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలోనూ ఇదే సమస్య భారత జట్టును వెంటాడింది...

సౌతాఫ్రికా టూర్‌లో 3-0 తేడాతో వన్డే సిరీస్‌లో వైట్ వాష్ అవ్వడానికి, టెస్టు సిరీస్ 2-1 తేడాతో కోల్పోవడానికి కూడా టీమిండియా మిడిల్ ఆర్డర్ వైఫల్యమే కారణం...
టాపార్డర్‌లో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లు రాణిస్తున్నా, లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్లుగా మలచడంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అవుతున్నారు...
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ఓ చిన్న మార్పుతో టీమిండియాకి ఉన్న మిడిల్ ఆర్డర్ సమస్యను పూర్తిగా తొలగించవచ్చని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
‘వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఇంకా ఏడాదిన్నర మాత్రమే ఉంది. గత మూడు నెలల కాలంలో టీమిండియాలో చాలా మార్పులు, చేర్పులు చూశాం...
ఇకపై ఇలాంటి మార్పులు చేస్తూ పోతే, వన్డే వరల్డ్ కప్ టోర్నీ సమయానికి సరైన విన్నింగ్ టీమ్‌ను తయారుచేయలేం...
ఇకనైనా మిడిల్ ఆర్డర్ సమస్యకు ఓ శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి. కెఎల్ రాహుల్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తే, చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది...
కెఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో వస్తే, రిషబ్ పంత్‌పై కూడా కావాల్సిన ఒత్తిడి పెట్టడానికి వీలవుతుంది. ఓ ఎండ్‌లో రాహుల్ కాపాడుకుంటుంటే, మరో ఎండ్‌తో పంత్ తన స్టైల్‌లో ఆడేందుకు వీలు ఉంటుంది...
రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతున్నా, నిలకడైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. కాబట్టి అతనిపై కావాల్సిన ఒత్తిడి పెట్టేందుకు కెఎల్ రాహుల్‌ను మిడిల్ ఆర్డర్‌కి పంపించడమే కరెక్ట్ స్ట్రాటెజీ అవుతుంది...
కెఎల్ రాహుల్ కావాలంటే వికెట్ కీపింగ్ కూడా చేయగలడు, మిడిల్ ఆర్డర్‌లోనూ ఆడగలడు కాబట్టి వరుసగా ఫెయిల్ అయితే తనకి జట్టులో ప్లేస్ ఉండదనే నిజాన్ని రిషబ్ పంత్ గ్రహించగలుగుతాడు..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...