విండీస్‌తో మొదటి వన్డేకి కెఎల్ రాహుల్ దూరం... అసలు కారణం ఇదే...
సౌతాఫ్రికా టూర్‌లో కెప్టెన్‌గా ప్రమోషన్ పొంది, సోషల్ మీడియా జనాల ట్రోల్స్‌కి గురైన కెఎల్ రాహుల్, విండీస్‌తో జరిగే మొదటి వన్డేకి దూరం కానున్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ గైర్హజరీకి కారణం ఏంటి?

కెప్టెన్‌గా మూడు వన్డేల్లో, ఓ టెస్టు మ్యాచ్‌లో ఓడిన కెఎల్ రాహుల్, 60 ఏళ్లుగా భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ సాధించలేని అతిచెత్త రికార్డును మూటకట్టుకున్నాడు...
సౌతాఫ్రికా టూర్ నుంచి స్వదేశం చేరుకున్న తర్వాత వెస్టిండీస్ సిరీస్ ఆరంభానికి ముందు తనకి కొన్ని రోజుల సెలవు కావాల్సిందిగా బీసీసీఐని కోరాడట కెఎల్ రాహుల్...
భారత క్రికెట్ జట్టు ఈ మధ్య మరీ బీభత్సమైన క్రికెట్ ఆడింది లేదు. అదీకాకుండా టీ20 వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత జరిగిన న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో కెఎల్ రాహుల్ ఆడలేదు కూడా...
మరీ సౌతాఫ్రికా టూర్‌లో మూడు టెస్టులు, మూడు వన్డే మ్యాచులు ఆడినంతనే కెఎల్ రాహుల్ అలసిపోయి విశ్రాంతి కోరుకున్నాడా? అంటూ ట్రోల్స్ వినిపించాయి...
కెఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌పైన కూడా అనుమానాలు రేగాయి. సౌతాఫ్రికా టూర్‌లో బ్యాటుతో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ కూడా ఇవ్వలేకపోయాడు కెఎల్ రాహుల్...
అయితే విండీస్‌తో మొదటి వన్డేకి కెఎల్ రాహుల్ దూరంగా ఉండడానికి అసలు కారణం వేరే ఉందట. లోకేశ్ రాహుల్ చెల్లెలు భావన వివాహ వేడుక, ఫిబ్రవరి 6న జరగనుంది...
భావన పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకే వెస్టిండీస్‌తో జరిగే మొదటి వన్డేకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు కెఎల్ రాహుల్. పెళ్లి ముగిసిన తర్వాత టీమిండియాతో కలవనున్నాడు రాహుల్...
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కి ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్‌లకు కరోనా పాజిటివ్ రావడంతో వారి స్థానంలో మయాంక్ అగర్వాల్‌కి పిలుపునిచ్చారు సెలక్టర్లు...
మొదటి వన్డేలో రోహిత్ శర్మతో కలిసి మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటిదాకా 5 వన్డేలు ఆడిన మయాంక్ అగర్వాల్, అత్యధిక స్కోరు 32 మాత్రమే...