- Home
- Sports
- Cricket
- టీమిండియా వన్డే కెప్టెన్‌గా కెఎల్ రాహుల్... విరాట్ కోహ్లీకి చెక్ పెట్టేందుకు బీసీసీఐ...
టీమిండియా వన్డే కెప్టెన్‌గా కెఎల్ రాహుల్... విరాట్ కోహ్లీకి చెక్ పెట్టేందుకు బీసీసీఐ...
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం, రోహిత్ శర్మకు ఎంత కలిసొచ్చిందో తెలీదు కానీ కెఎల్ రాహుల్‌కి మాత్రం బాగా కలిసి వస్తోంది...

అజింకా రహానే వరుసగా విఫలం అవుతుండడం, అతని స్థానంలో టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ గాయపడడంతో అనుకోకుండా కెఎల్ రాహుల్‌కి ప్రమోషన్ దక్కిన విషయం తెలిసిందే...
ఆరు నెలల క్రితం టెస్టు టీమ్‌లో ప్లేస్ కూడా లేని కెఎల్ రాహుల్‌ని వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం క్రికెట్ ఫ్యాన్స్‌నే కాదు, అతన్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసి ఉంటుంది...
టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు తొడ కండరాలు పట్టేయడంతో టీమిండియాకి దూరమైన రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఇంకా క్లారిటీ రావడం లేదు...
రోహిత్ శర్మ వన్డే సిరీస్ సమయానికి పూర్తిగా కోలుకోకపోతే... సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచుల వైట్ బాల్ సిరీస్‌కి ఎవరు సారథ్యం వహిస్తారనేది సర్‌ప్రైజింగ్‌గా మారింది...
టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన కెఎల్ రాహుల్‌కి వన్డే కెప్టెన్సీ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమచారం...
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి ఇప్పటికే జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై క్లారిటీ రాకపోవడం, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా బారిన పడడంతో జట్టు ఎంపిక ఆలస్యమవుతోంది...
ముంబై టెస్టు ఆరంభానికి ముందు గాయపడిన రవీంద్ర జడేజాతో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్... ఈ వన్డే సిరీస్‌కి దూరంగా ఉండబోతున్నారని సమాచారం...
‘మొదటి టెస్టు ముగిసిన తర్వాత టీమ్ సెలక్షన్ మీటింగ్ జరుగుతుంది. డిసెంబర్ 30 లేదా 31న మీటింగ్ పెట్టాలని అనుకున్నాం. అయితే బీసీసీఐ ఇంకా తేదీని ఖారారు చేయాల్సి ఉంది...’ అంటూ తెలియచేశాడు బీసీసీఐ అధికారి...
రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో రవిచంద్రన్ అశ్విన్, నాలుగేళ్ల తర్వాత వన్డే ఫార్మాట్‌లో కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి...
దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు వెంకటేశ్ అయ్యర్, రిషి ధావన్, షారుక్ ఖాన్ వంటి ఆల్‌రౌండర్లకు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసే అవకాశం ఉంది....