- Home
- Sports
- Cricket
- టెస్టు కెప్టెన్సీ అంటే ఆరెంజ్ క్యాప్ గెలిచినంత ఈజీ కాదు... కెఎల్ రాహుల్‌పై ట్రోలింగ్...
టెస్టు కెప్టెన్సీ అంటే ఆరెంజ్ క్యాప్ గెలిచినంత ఈజీ కాదు... కెఎల్ రాహుల్‌పై ట్రోలింగ్...
టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ గాయం కారణంగా తప్పుకోవడం, ఫామ్‌లో లేడనే వంకతో అజింకా రహానేని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం, భారత జట్టుపై భారీగా ప్రభావం చూపించింది. కెఎల్ రాహుల్ అనుభవలేమి కారణంగా సౌతాఫ్రికాతో రెండో టెస్టులో ఓటమి చవిచూడాల్సి వచ్చింది టీమిండియా...

గత ఏడేళ్లుగా టీమిండియాకి తిరుగులేని టెస్టు విజయాలు అందిస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఐసీసీ టైటల్స్ గెలవలేదనే లోటు తప్ప, విరాట్ కెప్టెన్సీలో ద్వైపాక్షిక సిరీసుల్లో దుమ్మురేపింది భారత జట్టు..
ఆస్ట్రేలియా టూర్‌లో రెండు సార్లు, ఇంగ్లాండ్ టూర్‌లో సిరీస్‌లు గెలిచిన టీమిండియా... సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ లక్ష్యంగా సౌతాఫ్రికాలో అడుగుపెట్టింది...
19 ఏళ్లుగా విజయం ఎరుగని సెంచూరియన్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో గెలుపు సాధించి రికార్డు క్రియేట్ చేసిన టీమిండియా, తొలిసారి జోహన్‌బర్గ్‌లో పరాజయాన్ని చవిచూసింది...
దీనికి ముఖ్యకారణం కెఎల్ రాహుల్ కెప్టెన్సీయే. ప్రత్యర్థి ముందు నాలుగో ఇన్నింగ్స్‌లో 240 పరుగుల లక్ష్యాన్ని పెట్టిన తర్వాత కూడా సఫారీ జట్టుపై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యాడు రాహుల్...
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో లార్డ్స్ టెస్టులో కేవలం ఒకటిన్నర సెషన్లలోనే ఇంగ్లాండ్ జట్టును ఆలౌట్ చేయగలిగింది భారత జట్టు. విరాట్, ప్లేయర్లలో నింపిన జోష్, ప్రత్యర్థిలో నింపిన భయం అలాంటిది...
అలాంటి దూకుడైన కెప్టెన్సీయే జోహన్‌బర్గ్‌లో భారత జట్టులో లోపించింది. కెఎల్ రాహుల్ ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్ అయినా కావచ్చు, కానీ కెప్టెన్‌గా మాత్రం పనికి రాడని మరోసారి రుజువు చేసింది...
సౌతాఫ్రికా జట్టు బ్యాటర్లు వికెట్ పడిన ప్రతీసారీ భాగస్వామ్యాలు నిర్మిస్తుంటే, బౌలింగ్ మార్పులతో వారిపై మరింత ఒత్తిడి తీసుకురావడంలో కెఎల్ రాహుల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...
తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్‌ని రెండో ఇన్నింగ్స్‌లో ఎలా వాడుకోవాలో కెఎల్ రాహుల్‌కి తెలియలేదు. రాహుల్ కెప్టెన్సీ లోపాలను డీన్ ఎల్గర్ టీమ్ సరిగ్గా ఉపయోగించుకుంది...
టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రేసులో అందరి కంటే ముందున్నాడు కెఎల్ రాహుల్. అందుకే రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ప్లేయర్లను పక్కనబెట్టి రాహుల్‌కి వైస్ కెప్టెన్సీ అప్పగించారు సెలక్టర్లు...
టెస్టులకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకున్నప్పుడు, అతనికి బదులుగా పాత వైస్ కెప్టెన్ అజింకా రహానేని తిరిగి ఆ పదవిలో కొనసాగించి ఉండవచ్చు...
అయితే పంతానికి పోయిన బీసీసీఐ, అజింకా రహానేకి తిరిగి వైస్ కెప్టెన్సీ ఇవ్వడానికి మొగ్గు చూపలేదు. ఆ పంతం ఖరీదు సఫారీ గడ్డపై సౌతాఫ్రికాను క్లీన్ స్వీప్ చేసే అద్భుత అవకాశం చేజారడం...
అజింకా రహానే ఇప్పటిదాకా కెప్టెన్‌గా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆసీస్ టూర్‌లో ఆస్ట్రేలియాకి కంచుకోటలాంటి గబ్బాలో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్నాడు రహానే...
అలాంటి అజింకా రహానేని పక్కనబెట్టి కెఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా తెరమీదకి తీసుకురావడం విమర్శలకు తావిస్తోంది. బీసీసీఐ పెద్దలు... తమ అధికారం చూపించుకోవడం కోసం టీమిండియాను ఓడించడం ఏంటని నిలదీస్తున్నారు అధికారులు...
విరాట్ కోహ్లీ సాధిస్తున్న విజయాలు చూసి కెఎల్ రాహుల్ కూడా టెస్టు కెప్టెన్సీ చాలా ఈజీ అనుకుని ఉంటాడని, అయితే టెస్టుల్లో జట్టును నడిపించడమంటే ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచినంత ఈజీ కాదని అతనికి తెలిసివచ్చి ఉంటుందని ట్రోల్ చేస్తున్నారు...
‘టీమిండియా ఇప్పుడు విరాట్ కోహ్లీ అటాకింగ్ కెప్టెన్సీ స్టైల్‌ని బాగా మిస్ అవుతోంది. విరాట్ ఈ మ్యాచ్‌లో ఉండి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేదేమో...’ అంటూ కామెంట్ చేశాడు సఫారీ మాజీ క్రికెటర్ షాన్ పోలాక్...