KKR vs MI: కోల్‌కత్తా వర్సెస్ ముంబై, ఈ రోజు మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...
IPL 2020లో భాగంగా నేడు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తలబడుతోంది. మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఊహించని పరాజయం ఎదురుకావడంతో నేటి మ్యాచ్‌లో కచ్ఛితంగా విజయం సాధించాలని కసిగా ఉంది రోహిత్ సేన. మొదటి మ్యాచ్‌లోనే విక్టరీ కొట్టి, సీజన్‌ను గ్రాండ్‌గా ఆరంభించాలని తపన పడుతోంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు. ఇరు జట్లలోని కీ ప్లేయర్లు వీళ్లే...
ప్యాట్ కమ్మిన్స్: ఈ ఐపీఎల్‌లో అత్యంత కాస్ట్‌లీ ప్లేయర్‌గా రికార్డు సాధించాడు ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్. రూ. 15 కోట్ల 50 లక్షలు చెల్లించి కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఇంతకుముందు మూడు సీజన్లు ఆడి 16 మ్యాచుల్లో 17 వికెట్లు తీసిన కమ్మిన్స్‌పై ఈసారి భారీ ఆశలు పెట్టుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.
ఆండ్రూ రస్సెల్: ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ క్రీజులో ఉంటే బౌలర్లకు దడ పుట్టాల్సిందే. బ్యాటింగ్‌లో 8 హాఫ్ సెంచరీలతో 1400 పరుగులు చేసిన కమ్మిన్స్, బౌలింగ్‌లో 55 వికెట్లు కూడా తీశాడు. మరోసారి రస్సెల్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.
సునీల్ నరైన్: ఈ విండీస్ ఆల్‌రౌండర్ ఇప్పటిదాకా 110 మ్యాచులాడడి 122 వికెట్లు పడగొట్టాడు. 6 సార్లు మ్యాచ్‌లో నాలుగేసి వికెట్లు తీసిన నరైన్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బౌలింగ్ విభాగంలో కీలకంగా మారాడు.
ఇయాన్ మోర్గాన్: ఇంగ్లాండ్‌కి వరల్డ్ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్, ఈ సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడబోతున్నాడు. చివరిసారి 2017లో ఐపీఎల్ ఆడిన మోర్గాన్, ఇప్పటిదాకా 52 మ్యాచుల్లో 854 పరుగులు మాత్రమే చేశాడు.
శుబ్‌మన్ గిల్: దేశవాళీ క్రికెట్‌లో మంచి టాలెంట్ ఉన్న క్రికెటర్‌గా గుర్తింపు పొందిన శుబ్‌మన్ గిల్, ఇప్పటిదాకా 27 మ్యాచులాడి 499 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
దినేశ్ కార్తీక్: ఈ సీనియర్ వికెట్ కీపర్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కు రెండు సీజన్లుగా కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో 182 మ్యాచుల్లో 3654 పరుగులు చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
రోహిత్ శర్మ: ఇప్పటిదాకా 189 ఐపీఎల్ మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ 4910 పరుగులు చేశాడు. మరో 90 పరుగులు చేస్తే 5 వేల పరుగుల క్లబ్‌లో చేరతాడు.
హార్దిక్ పాండ్యా: పాండ్యా ఫామ్‌లో ఉంటే ఏ బౌలర్ కూడా ఆపలేడు. ఇప్పటిదాకా వెయ్యికి పైగా పరుగులు, 42 వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా, గత మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
డి కాక్: మొదటి మ్యాచ్‌లో 33 పరుగులు చేసిన డి కాక్, ముంబై ఇండియన్స్‌కి మంచి ఆరంభం అందించాడు. కోల్‌కత్తాతో మ్యాచ్‌లో కూడా డి కాక్ కీలకం కాబోతున్నాడు.
జస్ప్రిత్ బుమ్రా: గత మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు బుమ్రా. ఆరో ఓవర్‌లో బౌలింగ్ మొదలెట్టిన బుమ్రా, అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. దాంతో తన ఫామ్‌ను నిలబెట్టుకోవడానికి ఈ మ్యాచ్ కీలకం కానుంది.