MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అయ్యర్ ఔట్..! కివీస్ పేసర్ కూడా అనుమానమేనట.. కేకేఆర్‌కు వచ్చిన కష్టాలు పగోడికి కూడా రావొద్దు..

అయ్యర్ ఔట్..! కివీస్ పేసర్ కూడా అనుమానమేనట.. కేకేఆర్‌కు వచ్చిన కష్టాలు పగోడికి కూడా రావొద్దు..

IPL 2023: మరో వారం రోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్ ప్రారంభానికి ముందు  కోల్కతా  నైట్ రైడర్స్ కు వరుస షాకులు తాకుతున్నాయి.  

2 Min read
Author : Srinivas M
Published : Mar 23 2023, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐపీఎల్ - 16 సీజన్   ప్రారంభానికి ముందే ఈ లీగ్ లో రెండు ట్రోఫీలను గెలుచుకున్న  కోల్కతా నైట్ రైడర్స్‌కు  భారీ షాకులు తప్పడం లేదు. ఇదివరకే ఆ జట్టు   సారథి  శ్రేయాస్ అయ్యర్.. వెన్ను నొప్పి కారణంగా ఐపీఎల్ నుంచి  తప్పుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి.  

26

అయ్యర్ వెన్నునొప్పికి సర్జరీ అవసరమని.. అతడు ఆపరేషన్  చేయించుకోవడానికే మొగ్గు చూపుతున్నాడని  పలు నివేదికలు సూచిస్తున్నాయి. వచ్చే నెలలో అయ్యర్ కు శస్త్రచికిత్స తప్పదని  కూడా బీసీసీఐ వర్గాలు  తెలిపినట్టు పలు వెబ్‌సైట్స్ కూడా రాసుకొచ్చాయి. 

36

ఈ వార్తే కేకేఆర్  కు  ఆందోళన కలిగిస్తుంటే తాజాగా  ఆ జట్టుకు మరో షాక్ తగలనున్నది.   గతేడాది గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడి ఈ సీజన్ లో  కోల్కతాకు ఆడనున్న  కివీస్ పేసర్ లాకీ ఫెర్గూసన్..  రాబోయే  ఐపీఎల్ లో పలు మ్యాచ్ లకు దూరం కానున్నాడని సమాచారం.   

46

ప్రస్తుతం  న్యూజిలాండ్ లోనే ఉన్న ఫెర్గూసన్.. దేశవాళీలో భాగంగా ఆక్లాండ్ తరఫున ఆడుతూ గాయపడ్డాడు. దీంతో అతడు మార్చి 25న శ్రీలంకతో జరుగబోయే తొలి వన్డే నుంచి తప్పుకున్నాడు.  50 ఓవర్లు ఆడే ఫిట్నెస్ అతడు సాధించలేదని,  అందుకే  ఫెర్గూసన్ ను  పక్కనబెట్టామని  కివీస్ బౌలింగ్ కోచ్   షేన్ జుర్గున్సెన్ తెలిపాడు. 

56

ఇదే విషయమై జుర్గున్సెన్ మాట్లాడుతూ..  ‘ఆక్లాండ్ తరఫున  నాలుగు రోజుల మ్యాచ్ ఆడిన ఫెర్గూసన్  చేతికి గాయమైంది.  అందుకే అతడు లంకతో తొలి వన్డేలో ఆడటం లేదు. తర్వాతి మ్యాచ్ లకు అయినా ఫెర్గూసన్ అందుబాటులో ఉంటాడా..? అనేది ఇప్పుడే చెప్పలేం...’అని  చెప్పాడు. మరి ఫెర్గూసన్ ఐపీఎల్ ఆడతాడా..? అని అడిగిన ప్రశ్నకు కూడా జుర్గున్సేన్.. దాని గురించి స్పందించడం  మరీ తొందరపాటు అవుతుందని అన్నాడు. 

66

గత సీజన్ లో  కేకేఆర్ తరఫున ఆడిన కివీస్ పేసర్ టిమ్ సౌథీ వికెట్లు  పడగొట్టడంలో విఫలమయ్యాడు.    కానీ ఫెర్గూసన్ మాత్రం   గుజరాత్ టైటాన్స్ తరఫున 14 మ్యాచ్ లు ఆడి    12 వికెట్లు పడగొట్టాడు.    అంతేగాక గతేడాది  ఐపీఎల్ లో అత్యధిక వేగవంతమైన డెలివరీ  (157.3) కూడా  ఫెర్గూసన్ పేరిటే ఉంది. పవర్ ప్లే తో పాటు డెత్ ఓవర్లలో వికెట్లు తీయడంలో   పెర్గూసన్ కీలకమైన బౌలర్. 
 

About the Author

SM
Srinivas M
Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 : వీరి అనుభవమే ఆయుధం.. ధోని, కోహ్లీ, రోహిత్ లే కాదు, అదరగొట్టేందుకు సిద్దమైన టాప్ 8 వెటరన్ ప్లేయర్స్
Recommended image2
IPL 2026: టీమిండియాలోకి వస్తే వాడు చాలా డేంజర్.. బ్యాటింగ్ ఆడితే వీడియో గేమ్‌లా ఉంటుంది
Recommended image3
CSK : ధోని టీమ్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2026 నుంచి స్టార్ బౌలర్ అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved