- Home
- Sports
- Cricket
- అతను టీమ్‌లో ఉండడం కరెక్ట్ కాదు! నేను చాలా బెటర్ బౌలర్‌ని... - భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్
అతను టీమ్‌లో ఉండడం కరెక్ట్ కాదు! నేను చాలా బెటర్ బౌలర్‌ని... - భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్
జహీర్ ఖాన్ రిటైర్మెంట్ తర్వాత సరైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కోసం ఎంతో మంది కుర్రాళ్లను ప్రయత్నించింది టీమిండియా. ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీ సింగ్ తర్వాత టీమిండియాలోకి మెరుపులా వచ్చి మాయమైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్లలో ఖలీల్ అహ్మద్ ఒకడు. ఐపీఎల్‌లో అదరగొట్టి, టీమ్‌లోకి వచ్చిన ఖలీల్ అహ్మద్ గురించి భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు...

Khaleel Ahmed
2016-17 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన ఖలీల్ అహ్మద్, ఆ తర్వాత నాలుగు సీజన్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడాడు. 2022 సీజన్‌లో మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌కి మారాడు.. ఐపీఎల్ 2022 వేలంలో ఖలీల్ అహ్మద్‌ని ఏకంగా రూ.5.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్..
khaleel ahmed
2018 ఆసియా కప్‌లో ఆడిన ఖలీల్ అహ్మద్, టీమిండియా తరుపున 11 వన్డేలు,1 4 టీ20 మ్యాచులు ఆడాడు. 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 మ్యాచుల్లో 81 పరుగులు సమర్పించిన ఖలీల్ అహ్మద్, కేవలం 2 వికెట్లు తీసి టీమ్‌కి దూరమయ్యాడు...
khaleel ahmed
ఖలీల్ అహ్మద్ అట్టర్ ఫ్లాప్ అయిన సమయంలో టీమిండియా ఛీప్ సెలక్టర్‌గా ఉన్న కృష్ణమాచారి శ్రీకాంత్, ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నిజం చెప్పాలంటే ఖలీల్ అహ్మద్, టీమిండియా ఉండడానికి అర్హుడు కాదు. అయితే ఆటను మెరుగుపర్చుకోవడానికి అతనికి ఇంకా అవకాశం ఉంది. అయితే ఎంత వేగంగా తన ఆటను మెరుగుపర్చుకుంటే అంత మంచిది...’ అంటూ కామెంట్ చేశాడు క్రిష్ శ్రీకాంత్...
ఈ వ్యాఖ్యలపై నాలుగేళ్ల తర్వాత వివరణ ఇచ్చాడు క్రిష్ శ్రీకాంత్. ‘నేను ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇప్పటికీ ఆ మాటలు ఎక్కడైనా మీడియాలో కనిపిస్తే చాలా బాధపడుతుంటా. నేను కూడా టీమిండియా తరుపున ఆడిన వాడినే...
టీమ్‌లోకి వచ్చినప్పుడు నా వయసు చాలా తక్కువ, ప్రతీదానికి ఎమోషనల్ అయిపోయేవాడిని. అయితే ప్రతీ విషయంలో నన్ను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నించేవాడిని. నాకు ఏది ముఖ్యమో దాని గురించి మాత్రమే పట్టించుకుంటా..
Kris Srikkanth
హెల్తీ డైట్‌ని ఫాలో అవుతూ నా ప్రాక్టీస్ మీదనే దృష్టి పెట్టేవాడిని. నా గురించి జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో వినేవాడిని మంచిగా చెబితే నవ్వి ఊరుకునేవాడిని. చెడుగా చెప్పినా నవ్వి ఊరుకునేవాడిని... నేను టీమిండియాకి ఆడినప్పటి కంటే ఇప్పుడు చాలా బెటర్ బౌలర్‌ని. ఆటను, బ్యాటర్లను చాలా ఈజీగా అర్థం చేసుకోగలను...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్..