- Home
- Sports
- Cricket
- కేన్ విలియంసన్‌కి గాయం, మరిన్ని మ్యాచ్‌లకు దూరం... ఆ ప్లేయర్ కూడా...- సన్‌రైజర్స్ కోచ్...
కేన్ విలియంసన్‌కి గాయం, మరిన్ని మ్యాచ్‌లకు దూరం... ఆ ప్లేయర్ కూడా...- సన్‌రైజర్స్ కోచ్...
కేన్ విలియంసన్‌లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్‌ను జట్టులో ఉంచుకుని, అతన్ని ఎందుకు ఆడించడం లేదనే ప్రశ్నలకు షాకింగ్ సమాధానం ఇచ్చాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ ట్రేవర్ బైలిస్... ఆరెంజ్ ఆర్మీని ఈ సీజన్‌లో కూడా గాయాలు వెంటాడుతున్నాయని తెలియచేశాడు...

గత సీజన్‌లో భువనేశ్వర్ కుమార్, మిచెల్ మార్ష్, విజయ్ శంకర్... గాయం కారణంగా మధ్యలోనే లీగ్ నుంచి తప్పుకున్నారు. అయినా ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చిన సన్‌రైజర్స్, మూడో స్థానంతో సరిపెట్టుకుంది...

‘వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియంసన్‌కు సన్‌రైజర్స్ తుది జట్టులో చోటు కల్పించలేకపోవడం, ఆ టీమ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...

భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవాలంటే ‘కేన్ ఉండాల్సిందే’ అంటూ పోస్టు చేశాడు. కేన్ విలియంసన్‌ను ఎందుకు ఆడించడం లేదంటూ సన్‌రైజర్స్‌ను తీవ్రంగా విమర్శించాడు...

‘కేన్ విలియంసన్ గాయంతో బాధపడుతున్నాడు. అతను పూర్తిగా కోలుకోవడానికి ఇంకొంత సమయం పట్టొచ్చు. ప్రస్తుతం నెట్ సెషన్స్‌లో పాల్గొంటున్న అతను త్వరలోనే బరిలో దిగుతాడు..

మొదటి మ్యాచ్‌లో గాయపడిన మహ్మద్ నబీ, కోలుకోవడానికి కొంత సమయం అవసరమవుతుందని విశ్రాంతినిచ్చాం....’ అంటూ వివరించాడు ఎస్‌ఆర్‌హెచ్ కోచ్ ట్రైవర్ బైలిస్...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో మహ్మద్ నబీ మెడకు బంతి బలంగా తాకింది. దాంతో రెండో మ్యాచ్‌లో అతనికి విశ్రాంతినిచ్చి జాసన్ హోల్డర్‌ను ఆడించింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

బౌలింగ్‌లో ఆకట్టుకున్న జాసన్ హోల్డర్, బ్యాటింగ్‌లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. అంతేకాకుండా సందీప్ శర్మ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన షాబజ్ నదీం కూడా ఒకే ఓవర్‌లో 22 పరుగులు సమర్పించాడు...

విరాట్ కోహ్లీపై మంచి ట్రాక్ రికార్డుతో పాటు పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న సందీప్ శర్మకు విశ్రాంతి కల్పించడంపై కూడా తీవ్ర విమర్శలు రేగుతున్నాయి...

వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ తర్వాతి మ్యాచ్ ముంబ ఇండియన్స్‌తో ఏప్రిల్ 17న చెన్నైలోనే జరగనుంది..