ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌కి కేన్ విలియంసన్... మూడో స్థానానికి పడిపోయిన స్మిత్...
తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్... టాప్ ప్లేస్‌కి ఎగబాకాడు. 890 పాయింట్లతో ఏకంగా రెండు స్థానాలు పైకెక్కిన కేన్ విలియంసన్ టాప్ ప్లేస్‌ను అధిరోహించాడు. ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ టాప్ ప్లేస్ నుంచి ఏకంగా మూడో స్థానానికి పడిపోయాడు.
వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 251 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదుచేసుకున్న కేన్ విలియంసన్, పాక్‌తో జరిగిన మొదటి టెస్టులో సెంచరీతో ఆదుకున్నాడు.
కేన్ విలియంసన్ నిలకడైన ప్రదర్శనతో పాటు కోహ్లీ టెస్టులకు దూరమవ్వడం, స్టీవ్ స్మిత్ ఫెయిల్ అవ్వడం న్యూజిలాండ్ కెప్టెన్‌కి బాగా కలిసొచ్చింది.
పెటర్నిటీ లీవ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ 879 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
భారత్‌తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో విఫలమైన స్టీవ్ స్మిత్... 877 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
లబుషేన్ 850 పాయింట్లతో టాప్ 4లో ఉండగా బాబర్ ఆజమ్ 789 పాయింట్లతో టాప్ 5లో ఉన్నాడు.
బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ చేసిన అజింకా రహానే ఏకంగా ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని టాప్ 6లోకి ఎంటర్ అయ్యాడు. .
డేవిడ్ వార్నర్ ఏడో స్థానంలో, బెన్ స్టోక్స్ 8వ స్థానంలో, జో రూట్ 9వ స్థానంలో ఉండగా, మొదటి రెండు టెస్టుల్లో విఫలమైన ఛతేశ్వర్ పూజారా 8వ ర్యాంకు నుంచి 10వ ర్యాంకుకి పడిపోయాడు.
బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ టాప్‌లో ఉండగా స్టువర్ట్ బ్రాడ్ రెండో స్థానంలో, నీల్ వాగ్నర్ మూడు, టిమ్ సౌథీ నాలుగో స్థానంలో ఉన్నారు.
ఆస్ట్రేలియాతో టెస్టుల్లో రాణించిన రవిచంద్రన్ అశ్విన్ 9వ ర్యాంకు నుంచి 7వ ర్యాంకుకి ఎగబాకగా... బుమ్రా 10వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరుకున్నాడు.
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కావడం విశేషం..