మనీశ్ అన్న మ్యాజిక్, డేవిడ్ భాయ్ హాఫ్ సెంచరీ, కేన్ మామ మెరుపులు... సీఎస్‌కే ముందు...

First Published Apr 28, 2021, 9:15 PM IST

IPL 2021 సీజన్‌లో మొదటిసారి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే హాఫ్ సెంచరీలతో పాటు కేన్ విలియంసన్ మెరుపులు తోడవడంతో మంచి స్కోరు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో భారీ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌కి ఈ టార్గెట్ సరిపోతుందా? అనే విషయం పక్కనబెడితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ రాణించిన విధానం ఆకట్టుకుంది.