‘విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తుంటే నాకు ఆ పాక్ కెప్టెన్ గుర్తుకువస్తాడు! అచ్చు అలాగే...’
2008లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన విరాట్ కోహ్లీ, వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టుతో 500 అంతర్జాతీయ మ్యాచులు పూర్తి చేసుకున్నాడు. 500 మ్యాచుల్లో 76 అంతర్జాతీయ సెంచరీలతో సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా అధిగమించాడు...
664 మ్యాచులు ఆడిన సచిన్ టెండూల్కర్, 500 మ్యాచులు ఆడే సమయానికి 75 అంతర్జాతీయ సెంచరీలే చేశాడు. అయితే విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన 100 సెంచరీల రికార్డు అందుకోవాలంటే మాత్రం మరో నాలుగైదు ఏళ్లు సూపర్ ఫామ్‌ని కొనసాగించాల్సి ఉంటుంది..
16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సచిన్ టెండూల్కర్, 24 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగి... 100 సెంచరీలు నమోదు చేయగలిగాడు. ఆ రోజు డీఆర్‌ఎస్ అందుబాటులో లేకపోవడం వల్ల అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్ల దాదాపు 30 సెంచరీలను మిస్ చేసుకున్నాడు సచిన్ టెండూల్కర్..
ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలోనూ రికార్డుల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్నాడు. మూడున్నరేళ్ల ఫామ్ కోల్పోయి బ్లాక్ పీరియడ్ ఫేస్ చేసిన విరాట్ కోహ్లీ, గత ఏడాదిగా మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. అయితే సచిన్ రికార్డులను అందుకోవాలంటే కోహ్లీ, ఇంతకుమించి రాణించాల్సి ఉంటుంది..
‘విరాట్ కోహ్లీ ఇండియన్ గ్రేట్. నా వరకూ సచిన్ తర్వాత విరాట్ కోహ్లీనే రేట్ చేస్తా. సచిన్ టెండూల్కర్ నేను చూసిన, ఆడిన గ్రేటెస్ట్ ప్లేయర్లలో ఒకడు. బ్రియాన్ లారా, వివ్ రిచర్డ్స్, వెస్టిండీస్‌లో వీళ్లిద్దరూ లెజెండరీ ప్లేయర్లు..
Virat Kohli 500th Match
రికీ పాంటింగ్, స్టీవ్ వా.. వీళ్లతో ఆడినప్పుడు నేను కుర్రాడిని. ఇంగ్లాండ్ ప్లేయర్ గ్రాహమ్ గూచ్, పాకిస్తాన్ ప్లేయర్ జావెద్ మియాందాద్.. నేను ఆడిన గొప్ప ప్లేయర్లలో కొందరు. నిజానికి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తుంటే నాకు ఎక్కువగా జావెద్ మియాందాద్ గుర్తుకు వస్తుంటాడు..
జావెద్ మియాందాద్ కూడా అవుట్ అవ్వడానికి ఏ మాత్రం ఇష్టపడడు. క్రికెట్‌లో తనదైన ముద్ర వేయాలని గట్టిగా కోరుకున్నాడు. విరాట్ కోహ్లీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు వెస్టిండీస్ పర్యటనలో ఓ సారి మాట్లాడాను...
Virat Kohli
తనకేం కావాలో, ఏం చేయాలనుకున్నాడో విరాట్‌కి పూర్తి క్లారిటీ ఉంది. నేను చూసిన టాప్ 4, 5 క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి కచ్ఛితంగా చోటు ఉంటుంది. రిటైర్మెంట్ సమయానికి సచిన్ టెండూల్కర్ తర్వాత టాప్ 2లోకి వచ్చినా వచ్చేయొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కౌంట్నీ వాల్ష్..